AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Polytechnic Lecturer Recruitment 2023: ఏపీలో 99 పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌.. ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) 99 లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/ టెక్ట్స్‌టైల్‌లోని సంబంధిత బ్రాంచిలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, పీజీ డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి..

APPSC Polytechnic Lecturer Recruitment 2023: ఏపీలో 99 పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
APPSC Polytechnic Lecturer Posts
Srilakshmi C
|

Updated on: Dec 25, 2023 | 1:54 PM

Share

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌.. ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) 99 లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/ టెక్ట్స్‌టైల్‌లోని సంబంధిత బ్రాంచిలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, పీజీ డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.98,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ పోస్టులు: 1
  • ఆటో మొబైల్ ఇంజినీరింగ్ పోస్టులు: 8
  • బయో-మెడికల్ ఇంజినీరింగ్ పోస్టులు: 2
  • కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ పోస్టులు: 12
  • సిరామిక్ టెక్నాలజీ పోస్టులు: 1
  • ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టులు: 4
  • కెమిస్ట్రీ పోస్టులు: 8
  • సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు: 15
  • కంప్యూటర్ ఇంజినీరింగ్ పోస్టులు: 8
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పోస్టులు: 10
  • ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టులు: 2
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ పోస్టులు: 1
  • ఇంగ్లిష్ పోస్టులు: 4
  • గార్మెంట్ టెక్నాలజీ పోస్టులు: 1
  • జియాలజీ పోస్టులు: 1
  • మ్యాథమెటిక్స్‌ పోస్టులు: 4
  • మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులు: 6
  • మెటలర్జికల్ ఇంజినీరింగ్ పోస్టులు: 1
  • మైనింగ్ ఇంజినీరింగ్ పోస్టులు: 4
  • ఫార్మసీ పోస్టులు: 3
  • ఫిజిక్స్‌ పోస్టులు: 4
  • టెక్స్‌టైల్ టెక్నాలజీ పోస్టులు: 3

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 29, 2024
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2024
  • రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే నెలల్లో 2024.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..