Crime News: అనుమానం పెను భూతమైంది.. తెల్లారేసరికి విగత జీవిగా భార్య.. అర్ధరాత్రి ఏం జరిగింది..?

భర్త వ్యసనాలు, అప్పులు ఆ ఇంట్లో కలకలం రేపాయి. ఆ తర్వాత భర్త అనుమానం పెను భూతంగా మారింది. చివరకు ఓ అమాయకురాలి నిండు ప్రాణం బలిగొంది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపింది. చాగల్లు మండలం ఊనగట్లలో శనివారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది.

Crime News: అనుమానం పెను భూతమైంది.. తెల్లారేసరికి విగత జీవిగా భార్య.. అర్ధరాత్రి ఏం జరిగింది..?
AP Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 12, 2023 | 10:05 AM

భర్త వ్యసనాలు, అప్పులు ఆ ఇంట్లో కలకలం రేపాయి. ఆ తర్వాత భర్త అనుమానం పెను భూతంగా మారింది. చివరకు ఓ అమాయకురాలి నిండు ప్రాణం బలిగొంది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపింది. చాగల్లు మండలం ఊనగట్లలో శనివారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గుత్తులవారిపాలెం గ్రామానికి చెందిన సాయి హరిత (25) కు ఊనగట్లకు చెందిన వెంకటేశ్వర్లుతో 8ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటేశ్వర్లు పొక్లెయిన్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే.. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ, వ్యసనాలకు బానిసయ్యాడు. ఇలా చూస్తుండగానే.. ఆర్థికంగా బాగా నష్టపోయాడు. దీనికితోడు భార్యపై అనుమానంతో అయిదు నెలల క్రితం కుటుంబంతో సహా.. ఖమ్మం పట్టణానికి వచ్చి నివాసముంటున్నాడు.

ఈ క్రమంలోనే నవంబర్ 1న శుభకార్యం నిమిత్తం సాయి హరిత పిల్లలతో పాటు భీమవరం వచ్చింది. 5న ఊనగట్లకు వచ్చింది. శనివారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి ఊనగట్లకు వచ్చాడు. అప్పటివరకు కోడలుకు సాయంగా పడుకున్న అత్త ఆదమ్మ.. కొడుకు రావడంతో బయటకు వెళ్లి వరండాలో పడుకుంది. ఉదయం లేచి చూసేసరికి కుమారుడు కనిపించలేదు. కోడలి ముఖంపై దుప్పటి కప్పి ఉంది. పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను పిలిచింది.

అందరూ వచ్చి సాయిహరిత మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్సై రమణ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. సాయిహరితను భర్త వెంకటేశ్వర్లు హత్య చేసి ఉంటాడని.. పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?