Andhra Pradesh: ప్రాణాలు మింగేస్తున్న గోదావరి.. ప్రమాదాలకు నెలవుగా పిచ్చుకలంక
అది డేంజర్ స్పాట్.. ఇప్పటికే అక్కడ కొంతమంది మృత్యువాత పడ్డారు. అయినా అధికారులు మాత్రం అక్కడికి వచ్చేవారినీ హెచ్చరించడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ(Dhawaleshwaram Barage) వద్ద స్థానికులు, పర్యాటకులు....
అది డేంజర్ స్పాట్.. ఇప్పటికే అక్కడ కొంతమంది మృత్యువాత పడ్డారు. అయినా అధికారులు మాత్రం అక్కడికి వచ్చేవారినీ హెచ్చరించడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ(Dhawaleshwaram Barage) వద్ద స్థానికులు, పర్యాటకులు ప్రమాదకర రీతిలో స్నానాలు చేస్తున్నారు. పిచ్చుకలంక దగ్గర ఉత్సాహంగా ఈత కొడుతూ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఏదైనా జరగరానిది జరిగితే.. నిండు ప్రాణాలను గోదావరి(Godavari) మింగేస్తే.. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఆ ప్రమాదం జరగకముందే హెచ్చరిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. అందమైన గోదావరి నదిని చూస్తే ఎవరికైనా అందులోకి దిగి ఈత కొట్టాలనిపిస్తుంది. గోదారి నీటిలో స్నానం చేస్తూ హాయిగా సేదదీరాలనిపిస్తుంది. ఇక పిచ్చుకలంక(Pichukalanka) దగ్గర గోదావరి మరింత అందంగా కనిపిస్తుంది. అంతేకాదు స్నానాలు చేసేందుకు కూడా కాస్తా అనువైన ప్రదేశంగా కనిపిస్తుంది. కానీ విహారం వెనుక విషాదం దాగి ఉన్నట్టు.. ఇక్కడ సరదాగా స్నానాలు చేసేందుకు నీటిలోకి దిగితే ప్రాణాలు కోల్పోయినవారూ ఉన్నారు.
ధవళేశ్వరం పిచ్చుకలంక స్పాట్ దగ్గర రెండు నెలల్లో పదుల సంఖ్యలో ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా జనాలు ఆ స్పాట్ దగ్గర స్నానాలు చేయడం ఆపడం లేదు. పైగా చిన్న పిల్లలను సైతం తీసుకెళ్లి బ్రిడ్జ్ పిల్లర్స్‌పై నుంచి నీటిలోకి దూకుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులను ఇక్కడికి రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ హెచ్చరిక బోర్డులు కానీ పెట్టిన దాఖలాలు లేవు. ఇక్కడికి వచ్చే ఆపకపోవడం వల్ల మరికొందరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి