JP Nadda: నేడు జేపీ నడ్డా ఏపీ పర్యటన.. జనసేనతో పొత్తులపై చర్చించే అవకాశం

ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ(BJP) దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు....

JP Nadda: నేడు జేపీ నడ్డా ఏపీ పర్యటన.. జనసేనతో పొత్తులపై చర్చించే అవకాశం
Nadda
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 06, 2022 | 7:12 AM

ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ(BJP) దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తికేంద్రాలుగా మార్చింది. వాటికి ఇన్ఛార్జ్ లను నియమించింది. ఈ నేపథ్యంలో ఆయా శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జ్ లతో విజయవాడలో నడ్డా భేటీ అవుతారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ(Vijayawada) నగర, ఎన్టీఆర్‌ జిల్లా పుర ప్రముఖులతో సమావేశం కానున్నారు. రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు. అందులో పార్టీ భవిష్యత్‌ వ్యూహాలపై చర్చిస్తారు.

రాత్రికి విజయవాడలోనే బసచేయనున్న నడ్డా.. మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. కేంద్ర పభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమై సాయంత్రానికి ఢిల్లీ వెళ్తారు. నడ్డా రాష్ట్ర పర్యటన విషయాలపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణలు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. జనసేనతో పొత్తుపై ఎలా వెళ్లాలనేది తమ పార్టీ జాతీయ నాయకులు నిర్ణయిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి