Andhra Pradesh: కాకినాడ అత్యాచారం కేసు.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు.. అయినప్పటికీ

తెలుగు రాష్ట్రాల్లో ఏంజరుగుతోంది?. ఓ వైపు పరువుహత్యలు, మరోవైపు బాలికలపై జరుగుతున్న లైంగికదాడులు. అడుగడుగునా భయంతో బతకలేక.. వారి నుంచి తప్పించుకోలేక నరకం అనుభవిస్తున్నారు. కాకినాడ(Kakinada) జిల్లాలో అలాంటి....

Andhra Pradesh: కాకినాడ అత్యాచారం కేసు.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు.. అయినప్పటికీ
Harassment
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 06, 2022 | 9:16 AM

తెలుగు రాష్ట్రాల్లో ఏంజరుగుతోంది?. ఓ వైపు పరువుహత్యలు, మరోవైపు బాలికలపై జరుగుతున్న లైంగికదాడులు. అడుగడుగునా భయంతో బతకలేక.. వారి నుంచి తప్పించుకోలేక నరకం అనుభవిస్తున్నారు. కాకినాడ(Kakinada) జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సినవారే వింతపశువుగా మారుతున్నారు. ఓ ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్‌ చిన్నారి అని కూడా చూడకుండా చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందిన గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అరెస్టు చేసి, నేరుగా కోర్టులో హాజరుపరిచారు. విచారణలో బాలికపై పలుమార్లు లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. కాగా విజయ్ కుమార్‌ ఫొటో, ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇచ్చేందుకు పోలీసులు నిరాకరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలికి తగిన న్యాయం చేయకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని మహిళాసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

కాకినాడ నగరానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ సమీపంలోని పాఠశాలలో చదువుకుంటోంది. హాస్టల్ కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్‌ బాలికపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చింది. బాలిక ముభావంగా ఉండటం, అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని గమనించిన తల్లి.. అసలు విషయం ఏమిటని ఆరా తీసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో చికిత్స కోసం ఈ నెల 1న కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు గర్భస్రావం అయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా మందులు ఇస్తానంటూ కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చాడని, వాటిని వేసుకున్నాక మత్తుగా అనిపించిందని బాలిక పోలీసులకు వెల్లడించింది. వీరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు విజయకుమార్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి