Andhra Pradesh: ఇంట్లో ఘనంగా శుభకార్యం.. అంతలోనే ఘోరం.. శివారులో తేలిన శవం..

ఓ వైపు ఇంట్లో ఘనంగా శుభకార్యం జరుగుతుంది.. కుటుంబసభ్యులు, బంధువులంతా సరదా సరదాగా గడుపుతున్నారు.. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన కుటుంభసభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు..

Andhra Pradesh: ఇంట్లో ఘనంగా శుభకార్యం.. అంతలోనే ఘోరం.. శివారులో తేలిన శవం..
Andhra Pradesh Cops
Follow us

|

Updated on: Oct 29, 2022 | 10:25 PM

ఓ వైపు ఇంట్లో ఘనంగా శుభకార్యం జరుగుతుంది.. కుటుంబసభ్యులు, బంధువులంతా సరదా సరదాగా గడుపుతున్నారు.. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన కుటుంభసభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు.. ఈ హత్యతో గ్రామస్తులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. కుటుంబసభ్యుల రోదనలు మిన్ననంటాయి.. శుభకార్యం జరుగుతున్న సమయంలోనే ఆ హత్య ఎందుకు జరిగింది? హత్య చేసిందెవరు? అసలు హత్యకు గల కారణాలు ఏంటి? ఇవే అక్కడివారికి అయోమయంగా మారాయి.

విజయనగరం జిల్లా సంతకవిటి మండలం ఎస్ అగ్రహారంలో గోవింద్ అనే వ్యక్తి దారుణ హత్యతో ఊరు ఊరంతా ఉలిక్కి పడింది. గోవింద్‌ది ఇదే వూరు. ఉద్యోగ రీత్యా కుటుంబంతో సహా విశాఖలో ఉండేవాడు. సోదరుడు పరుశురాం ఇంట్లో ఫంక్షన్‌ కోసం గోవింద్‌ ఆయన భార్య సొంతూరకు వచ్చారు. ఫంక్షన్‌ ఏర్పాట్లనే తనే స్వయగా చూసుకన్నాడు. ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. అంతలోనే దారుణం. శివారులో గోవింద్‌ శవమయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కుటుంబసభ్యులు, బంధువులు పరుగున పరుగున అక్కడకు వెళ్లారు. నిర్జీవంగా పడివున్న గోవింద్‌ను చూసి దు:ఖం కట్టలు తెగింది. అనారోగ్యం లేదు.. ఎవరితో విభేదాల్లేవు.. మరి గోవింద్‌ అర్ధాంతర మరణానికి కారణాలేంటి?..ఇది ముమ్మాటికీ ఓ మహిళ ఆమె భర్త పనేనన్నారు గోవింద్‌ భార్య, తల్లి. వాళ్లే ఫోన్‌ చేసి పిలిచి హత్య చేశారని ఆరోపించారు.

అదే నిజమా? మరో కోణం ఏదైనా ఉందా? సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. క్లూస్‌ సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగింది. జాగిలాలు ఓ ఇంటి దగ్గర ఆగాయి. అంతే సంచలనం రేపిన గోవింద్‌ హత్య కేసులో కీలక క్లూ చిక్కనే చిక్కింది. నిందితులు లలిత, లక్ష్మణ్‌రావు దంపతులకు ముసుగు పడిందిలా. కూపీలాగితే విచారణలో వివాహేతర సంబంధ యవ్వారం తెరపైకి వచ్చింది. అంతేకాదు రక్తం చుక్క నేలరాలకుండా గోవింద్‌ను కడతేర్చిన వైనం రివీలైంది దర్యాప్తులో. ఇల్లీగల్‌ కనెక్షన్‌ కట్‌ చేయాల్సిందిపోయింది కరెంట్‌ మాటును ఖతర్నాక్‌ స్కెచ్చేశారు లలిత, లక్ష్మణ్‌రావు.

ఇవి కూడా చదవండి

భార్యతో కలిసి ప్రీ ప్లాన్డ్‌గా గోవింద్‌ను హత్య చేశాడు లక్ష్మణ్‌రావు. ఈ ముచ్చట తెలిసి ఓరీ లక్ష్మణా నీలో ఇంత కసి వుందా? అని అవ్వాక్కయ్యారు గ్రామస్తులు. మాములుగా కన్పించే లక్ష్మణ్రావు కరెంట్‌ షాక్‌తో గోవింద్‌ను చంపిన వైనం ఊళ్లో చర్చగా మారింది. లలితతో గోవింద్‌కు ఫోన్‌ చేయించి.. అతనొచ్చేలోగా జే వైర్‌కు కరెంట్ కనెక్షన్‌ ఇచ్చి.. ఆ వైరును గోవిందు టచ్‌ చేసేలా చేశాడు. కరెంట్‌ షాక్‌తో గోవింద్‌ చనిపోగానే గప్‌చుప్‌న వైర్లన్నీ తీసి పారేశారు. కానీ దర్యాప్తులో పక్కా ఎవిడెన్స్‌ సేకరించిన పోలీసులు ఈ కేడీ కపుల్స్‌ను కటకటాల బాటపట్టించారు. గోవింద్‌ అనుమానాస్పద మృతి కాస్తా మర్డర్‌గా మారింది. మిస్టరీని చాకచక్యంగా చేధించి నిందితుల ఆటకట్టించారు పోలీసులు. ఐతే గోవింద్‌ మరణం ఊళ్లో విషాదాన్ని నింపింది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు స్థానికులు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..