Andhra Pradesh: సాఫీగా సాగుతున్న జీవితంలో భారీ కదుపు.. మిస్టరీగా మారిన డ్రైవర్ మృతి.. అసలు నిజం ఏది?
పచ్చని కోనసీమ.. అమలాపురంలో ఓచిన్న కుటుంబం.. వృత్తిరీత్యా అతను డ్రైవర్.. కొన్నాళ్లుగా ఓ ఆఫీసర్ దగ్గర డ్యూటీ చేస్తున్నాడు. సార్ అంటే విజయ్ మోహన్‌కు ఎంతో గౌరవం. అభిమానం. ఆఫీసర్‌కు కూడా విజయ్..

పచ్చని కోనసీమ.. అమలాపురంలో ఓచిన్న కుటుంబం.. వృత్తిరీత్యా అతను డ్రైవర్.. కొన్నాళ్లుగా ఓ ఆఫీసర్ దగ్గర డ్యూటీ చేస్తున్నాడు. సార్ అంటే విజయ్ మోహన్‌కు ఎంతో గౌరవం. అభిమానం. ఆఫీసర్‌కు కూడా విజయ్ అంటే అంత నమ్మకం. గుడివాడ నుంచి అమలాపురానికి బదిలీ అయ్యాడు సదరు అధికారి. విజయ్‌ను కూడా తన వెంట తెచ్చుకున్నాడు. ఫ్యామిలీతో సహా విజయ్ అమలాపురం షిఫ్ట్ అయ్యాడు. అంతా సాఫీగా వుందనుకునే టైమ్‌లో ఒక్కసారిగా కలకలం.. ఏం జరిగిందో ఏమో కానీ ఇంట్లోనే విజయ్ మోహన్ అర్ధాంతరంగా చనిపోయాడు.
విజయ్ డెడ్‌బాడీని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంకు తరలించిన వైనంపై డౌట్స్ తెరపైకి వచ్చాయి. వీరవాసం.. అత్తాగారి వూరు. అతని పేరెంట్స్ ఉండేది మాత్రం గుడివాడలో. విజయ్ అమలాపురం చనిపోతే శవాన్ని వీరవాసం తరలించడంపై విజయ్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులుకు ఫిర్యాదు చేశారు దాంతో మళ్లీ డెడ్‌బాడీని అమలాపురం తరలించారు. పోలీసులు సీన్‌లోకి వచ్చారు. అసలు విజయ్ మరణానికి కారణాలేంటి? అని కూపీ లాగారు. కడుపునొప్పి వల్ల సెలవు పెట్టాడని.. రాత్రి వరకు బాగానే ఉన్నాడని.. తెల్లారి చూసే సరికి కిటికీ దగ్గర అపస్మారక స్థితిలో కనిపించాడని వాపోయారు విజయ్ భార్య కుమారి. ఇరుగుపొరుగు సాయంతో హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని కన్నీటిపర్యంతమయ్యారామె.
అదీ విజయ్ భార్య కుమారి వెర్షన్. ఐతే విజయ్ తల్లి ఆవేదన మాత్రం మరోలా ఉంది. భార్య చెప్తున్నట్టుగా అనారోగ్యం వల్లే విజయ్ సూసైడ్ చేసుకున్నాడా? లేక మరేదైనా కోణం వుందా? డ్యూటీలో ఆఫీసర్‌తో ఏవైనా గొడవలున్నాయా? ఇంట్లో వివాదాలే కారణమా? అసలు విజయ్‌ది ఆత్మహత్యా? హత్యా? తమకు ఎన్నో అనుమానాలున్నాయన్నారు విజయ్ పేరెంట్స్. వాయిస్: విజయ్ తల్లి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు అమలాపురం పోలీసులు. స్పాట్‌ను పరిశీలించారు. కీలక ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు ఎస్ఐ పరదేశి.




పంచాయతీరాజ్ ఆఫీసర్ విక్టర్ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న విజయ్ కుమార్ అనుమానాస్పద మరణం అమలాపురంలో చర్చగా మారింది. ఆత్మహత్య అనేది భార్య వెర్షన్.. తన బిడ్డ అంత పిరికివాడు కాదని.. విజయ్ మరణంపై తమకు అనుమానాలున్నాయంటోంది తల్లి. మరి అసలు నిజం ఏంటి? ఆఫీసర్ వెర్షన్ ఏంటి? దర్యాప్తులో ఎలాంటి సంచలనాలు తెరపైకి రానున్నాయనేది చర్చగా మారింది స్థానికంగా. త్వరలోనే ఈ మిస్టరీ తేలుతుందని అంటున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
