Hindupur: తాగిన మత్తులో ఇంట్లోనే సిగరేట్ వెలిగించాడు.. ఆ ముక్క బెడ్‌పై పడటంతో..
మద్యం మత్తులో ఉన్నాడు. సిగరెట్ తాగాలనుకున్నాడు. అందుకోసం బయటకు కూడా వెళ్లలేదు. ఇంట్లోనే వెలిగించేశాడు. ఆ స్మోక్ పీలుస్తుండగా.. అది చేతిలో నుంచి జారి బెడ్‌పై పడింది. అంతే...

ఒకే ఒక్క చిన్న పొరపాటు చాలు ప్రాణం పోవడానికి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా.. ఊహించనంత నష్టం వాటిల్లుతుంది. హిందూపురం పట్టణం బోయ పేటలో అదే జరిగింది. బోయపేటకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఫూటుగా మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే ఇంట్లోనే బెడ్‌పై కూర్చుని సిగరెట్ వెలిగించాడు. ఆ సిగరెట్ ముక్క బెడ్‌పై పడి మంటలు వ్యాపించాయి. దీంతో సుధాకర్ గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన సుధాకర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
చూశారుగా.. మద్యం మత్తులో చేసిన చిన్న పొరపాటు ప్రాణాన్నే తీసింది. మైకంలో చేసే పనులు ఇలానే ప్రాణాలు తీస్తాయి. మద్యం మీ ఆరోగ్యాలకు హానికరం మాత్రమే కాదు. ఇతరులకు కూడా ప్రమాదం. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. మద్యం మత్తులో అయ్యే గొడవల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సుధాకర్ పరిస్థితి చూడండి.. సోయి లేకుండా తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతడి కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..




