Krishna District: ఏంట్రా ఇలా తయారయ్యారు.. తమ్ముడి చెవి కొరికి కరకరా నమిలేసిన అన్న
అన్నదమ్ముల మధ్య పొరభత్యాలు రావడం సహజం. ఏదైనా పంచాయతీ ఉంటే కుటుంబ పెద్దల వద్దలకు వెళ్లాలి. లేదంటే ఊర్లోని పెద్ద మనుషులను సంప్రదించాలి. అదీ కుదరదంటే.. పోలీసులు లేదా న్యాయవ్యవస్థను సంప్రదించాలి. కానీ ఇలా దారుణ దాడులకు దిగడం ఏంటి..?

కృష్ణాజిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మచిలీపట్నం నియోజకవర్గం సత్రం పాలెంలో సొంత తమ్ముడిపై అన్న పైశాచికంగా దాడి చేశాడు. ఆస్తి కోసం జరిగిన కొట్లాటలో సొంత తమ్ముడు చెవి కొరికేశాడు అన్న. వాారం రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందరూ చూస్తూ ఉండగా తమ్ముడు నరసింహ స్వామిపై దాడికి పాల్పడ్డాడు అన్న సీతారామయ్య. చెవిని కొరికి.. రక్తం కారుతున్నప్పటికీ నములుతూ రోడ్ల మీద తిరిగిన సీతారామయ్యను స్థానిక ప్రజలు భయాందోళనలు గురయ్యారు. కొరికిన చెవిని అన్న నమిలేయడంతో ఏమీ చేయలేమని చేతులెత్తేశారు డాక్టర్లు. ఒకవేళ చెవి తెగి పడి ఉంటే.. దాన్ని అతికించేవారమని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కసారిగా ఉన్మాదిలా మారిన సీతారామయ్య తన పైశాచిక చేష్ఠలతో గ్రామంలో దడ పుట్టించాడు. అయితే నిందితుడికి తాజాగా స్టేషన్ బెయిల్ మంజూరయినట్లు తెలుస్తుంది. ఇలాంటి సైకో, ఉన్మాది ప్రవర్తనతో రెచ్చిపోయేవారిపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో.. ఇలాంటి వారిని చూసి మరికొందరు బరి తెగించే అవకాశం ఉంది. అందుకే ఉన్మాదుల్లా వ్యవహరించే వ్యక్తులపై నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలిపెట్టకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..