Pandem Kollu: పందెం కోడిపుంజులను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఎక్కడంటే..
విక్రయానికి సిద్దంగా ఉన్న 45 పందెం పుంజులను తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కోడి పందేలు వద్దు అని చెబుతున్నా.. పందెంరాయుళ్లు వినకపోవడంతో దీంతో అభం శుభం తెలియని కోడిపుంజులు జైలు పాలయ్యాయి.

సంక్రాంతి అంటేనే.. పల్లె క్రాంతి.. సంస్కృతి, సంప్రదాయాల వేడుక. అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ల సందడితో సంబరాలు అంబరాన్ని అందుకుంటున్నాయి. సంబరాలు ఊరువాడా మొదలయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందడి .. అంటేనే ఉభయ గోదావరి జిల్లాలే అందరికి ముందుగా గుర్తుకొస్తాయి. సంస్కృతి సంప్రాయాలతో పాటు.. కోడిపందేలకు కూడా నెలవు. ఇప్పటికే పందెం రాయుళ్లు తమ పుంజులతో బరిలోకి దిగుతున్నారు. లక్షలాది రూపాయలు ఇప్పటికే చేతులు మారాయి.
వాస్తవానికి పందెం రాయుళ్లు ఆరు నెలల ముందు నుంచే పుంజులను సిద్ధం చేసేస్తారు. కొందరికైతే ఇది ఉపాధిలా మారిపోయింది. కోడిపుంజులను పెంచి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయానికి సిద్దంగా ఉన్న 45 పందెం పుంజులను తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపాలెం పట్టణానికి చెందిన దేవరకొండ సుబ్బారాయుడు బృందం సుమారు 50 పందెం కోళ్లను లారీలో తీసుకొచ్చి మలికిపురంలోని పద్మ థియేటర్ సమీపంలో మంగళవారం ఆమ్మకానికి పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చేసరికి 5 పుంజులను అమ్మేశారు.. దీనితో మిగిలిన 45 కోళ్ళను స్టేషన్‌కు తరలించారు పోలీసులు.
పోలీసులు కోడి పందేలు వద్దు అని చెబుతున్నా.. పందెంరాయుళ్లు వినకపోవడంతో దీంతో అభం శుభం తెలియని కోడిపుంజులు జైలు పాలయ్యాయి. తమకు ప్రమేయం లేకుండానే పందెం కోళ్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాయి. అక్కడ పోలీసులు ఫుడ్ పెడుతూ పోలీసులు పహార కాస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..