AP News: ఎన్నికల తనిఖిల్లో భాగంగా RTC బస్సును ఆపిన పోలీసులు.. ఓ ఫ్యామిలీ లగేజ్ చెక్ చేయగా
పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా, ఎంత పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్న అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ రెచ్చిపోతున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేయడానికి కొత్త దారులను వెతుకుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ద్వారా గంజాయి రవాణా సాగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఎన్నికల నేపథ్యంలో విసృత తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు డబ్బు, బంగారం, తాయిలాలతో పాటు పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో భారీగా గంజాయి పట్టుకున్నారు అధికారులు. గుణుపూరు నుంచి శ్రీకాకుళం వెళ్లే ఆర్టీసి బస్సులో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ నిర్వహించగా.. 50 కిలోల గంజాయి పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీల్లో ఈ గంజాయి చిక్కింది. నిందితుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. నిందితులు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు అని, మహారాష్ట్రకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
ఐతే ఈ అక్రమ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఇదే మొదటిసారినా? లేక చాలాకాలంగా ఈ తంతు జరుగుతుందా? అనే దానిపై అనుమానంతో నిందితులని విచారిస్తున్నారు కొత్తూరు పోలీసులు. నిందితులది మహారాష్ట్ర కావటంతో వాళ్ళు మరాఠీ భాషలో మాట్లాతుండటం వల్ల పోలీసులకు విచారణలో ఇబ్బంది ఎదురయ్యింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. నిందితుల్లో బాలుడు కూడా ఉండటం గమనార్హం ఈ ఘటన పై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సిఐ ఆర్.వేణు గోపాల్ రావు తెలిపారు.
ఆంధ్రాలో గంజాయి అక్రమ రవాణా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ మధ్య ఎక్కువగా తనిఖీల్లో పట్టుబడుతుండటంతో పోలీసులు కూడా అలెర్టయ్యారు. గంజాయి, డ్రగ్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. అడుగడుగా చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహించడంతో భారీ గంజాయి పట్టుబడుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..