AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ జిల్లాలకు మోస్తరు వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఏపీ ప్రజలకు వర్ష సూచన. రాబోయే రోజుల్లో ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇవిగో..

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ జిల్లాలకు మోస్తరు వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో..
AP Weather Report
Follow us

|

Updated on: Dec 20, 2022 | 7:41 AM

మధ్య దక్షిణ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్ర ప్రాంతంపై ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా మారి శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ మేరకు సోమవారం ఓ నివేదికలో పేర్కొంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై స్వల్పంగానే ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. పలు జిల్లాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.

డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు అల్పపీడనం కారణంగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇదే రాష్ట్రంలో ఈ ఏడాది చివరిసారిగా కురిసే వర్షాలని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య/తూర్పు గాలులు వీస్తున్నాయి. మరోవైపు రాబోయే రెండు రోజుల్లో పగటిపూట వాతావరణం వెచ్చగా.. రాత్రి సమయాల్లో చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో చల్లగాలులు క్రమేపీ పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు.