AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీకి వాయు’గండం’.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే.!

తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందా..?! రాగల రోజుల్లో భారీ వర్షాలు తప్పవా..?! ఇప్పటికే ఏర్పడిన ఆవర్తనంతో..

AP News: ఏపీకి వాయు'గండం'.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే.!
Andhra Weather Update
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 24, 2023 | 7:47 PM

Share

తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందా..?! రాగల రోజుల్లో భారీ వర్షాలు తప్పవా..?! ఇప్పటికే ఏర్పడిన ఆవర్తనంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తుంటే.. మరి అల్పపీడనం ఏర్పడితే ఆ పరిస్థితి ఎలా ఉండబోతోంది.? అది కాస్తా మరింత బలపడి వాయుగుండంగా మారితే..?! వర్షాలు మోస్తరు నుంచి భారీగా దంచి కొడతాయి. ఎస్..! ప్రస్తుత అంచనా బట్టి ఇదే జరుగుతుందంటుంది వాతావరణ శాఖ.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు కాస్త తగ్గినప్పటికీ.. ప్రజలు ఇంకా అలర్ట్‌గానే ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణకు ఇప్పటికీ ముప్పు పొంచే ఉందని హెచ్చరిస్తోంది. ఎందుకంటే..! వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరికొద్ది గంటల్లో బలపడి రేపటికి అల్పపీడనంగా.. ఆపై మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. దీనికి తోడు రుతుపవనాలు మరింత యాక్టివ్‌గా మారాయి. రుతుపవన ద్రోణి కొనసాగుతూ ఉంది. దక్షిణ ఒడిస్సా, పరిసర ప్రాంతాలపై ఆవర్తనంగా కొనసాగుతుంది. దీంతో.. ఎనీ టైమ్‌, మళ్లీ వరుణుడు విరుచుకుపడటం ఖాయమని హెచ్చరికలు ఇస్తోంది వాతావరణ శాఖ. ఈనెల 28 వరకు అప్రమత్తంగా, అలర్ట్‌గా ఉండాల్సిందేనని ప్రజలకు తెలిపింది.

ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

ఆవర్తనం బలపడుతున్న నేపథ్యంలో ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. కృష్ణ, గుంటూరు, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షం కురుస్తోందని అంటున్నారు తుఫాను హెచ్చరికలు కేంద్రం డైరెక్టర్ సునంద. రాగల ఐదు రోజుల్లో మరింత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే.. ఈనెల 28 వరకు వర్షాలు తప్పేలా కనిపించట్లేదు. అతి భారీ వర్షాలు పడే చోట ఆరెంజ్, భారీ వర్షాలు కురిసే చోట ఎల్లో అలెర్ట్స్ కూడా జారీ చేశామని డైరెక్టర్ చెప్పారు.

కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు..

బంగాళాఖాతంలో ఇంకా సముద్రం అల్లకల్లోలంగానే ఉంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆవర్తనం బలపడుతున్న నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది 65 కిలోమీటర్లకు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.

ఉపరితల ఆవర్తనాలకు తోడు.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రుతుపవన ద్రోణి కూడా దక్షిణం వైపు పయణిస్తోంది. దీంతో కోస్తా, యానాంలలో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో పాటు రేపటి నుంచి రాయలసీమలోనూ వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఈనెల 28 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వర్షపాతం వివరాలివే..!

గడిచిన 24 గంటల్లో ఏపీలో చాలా చోట్ల అధిక వర్షపాతం నమోదయ్యాయి. అల్లూరి జిల్లా చింతూరు ఎర్రంపేటలో 19 సెంటీమీటర్లు రికార్డు అయింది. చెంతురులో 16 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా కొత్తవలసలో 11 సెంటీమీటర్లు, విశాఖ జిల్లా జాతర వద్ద 10 సెంటీమీటర్లు, కృత్తివెన్ను పెడన సాగర్, గుడివాడలో సహా కృష్ణా జిల్లాలో చాలా చోట్ల తొమ్మిదేసి సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..