Andhra Pradesh: అమరావతిలో అసలేం జరగనుంది .? ఓవైపు పిటిషనర్ల పోరాటం, మరోవైపు ఇళ్ల నిర్మాణం

రాజధానిగా అమరావతి కొనసాగాలని, మూడు రాజధానులు వద్దని ఆందోళన చేస్తున్నవారు తమ పిటిషన్లతో కోర్టుల్లో పోరాటం చేస్తుంటే, మరోవైపు అమరావతి (సీఆర్డీయే) ప్రాంతంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం స్వయంగా తన చేతులతో శంకుస్థాపన చేశారు. పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు రాకూడదని ఇప్పటికే హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో 5 కేసులు...

Andhra Pradesh: అమరావతిలో అసలేం జరగనుంది .? ఓవైపు పిటిషనర్ల పోరాటం, మరోవైపు ఇళ్ల నిర్మాణం
Amaravati
Follow us
S Haseena

| Edited By: Narender Vaitla

Updated on: Jul 24, 2023 | 7:24 PM

రాజధానిగా అమరావతి కొనసాగాలని, మూడు రాజధానులు వద్దని ఆందోళన చేస్తున్నవారు తమ పిటిషన్లతో కోర్టుల్లో పోరాటం చేస్తుంటే, మరోవైపు అమరావతి (సీఆర్డీయే) ప్రాంతంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం స్వయంగా తన చేతులతో శంకుస్థాపన చేశారు. పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు రాకూడదని ఇప్పటికే హైకోర్టులో 18, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారని వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నామని వెంకటపాలెం సభలో ముఖ్యమంత్రి అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే.. రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

రాజధానిలో ఇళ్ల వివాదం ఎందుకు వచ్చింది?

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీయే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలో సెక్షన్‌ 53 (1) (d)లో కనీసం 5 శాతం భూమిని ఎకనామికల్‌ వీకర్‌ సెక్షన్‌కు ఇవ్వాలని నిర్దేశించారు. కాని మాస్టన్‌ ప్లాన్‌ రూపొందించినప్పుడు మాత్రం నాలుగు జోన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. జోన్‌-1లో ఇప్పుడున్న 29 గ్రామాలు, జోన్‌-2లో ఉన్నతస్థాయి వ్యక్తులకు, ఆ వర్గాలకు కేటాయించారని, జోన్‌-3లో రైతులకు ఇచ్చే రిటనబుల్‌ ప్లాట్స్‌ ఇచ్చారని, జోన్‌-4లో హైరైజ్‌ బిల్డింగ్స్‌కు కేటాయించారంటూ ఈ ప్రభుత్వం చట్టసవరణకు దిగింది. సీఆర్డీయే చట్టంలో చెప్పినట్టుగా, 5శాతం స్థలం అంశం జోనింగ్‌లో ఎక్కడుందనీ, పేదవాడి విషయాన్ని పూర్తిగా విస్మరించినట్టేనని అందుకే చట్టాన్ని సవరిస్తున్నట్టుగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం మొత్తంగా 4 కీలక సవరణలు సీఆర్డీయే చట్టాన్ని సవరిస్తూ యాక్ట్‌ 13ను తీసుకు వచ్చింది.

1) గత ప్రభుత్వం సీఆర్డీయే చట్టాన్ని రూపొందించినప్పుడు చట్టాన్ని సవరించాలంటే కొన్ని నిబంధనలు పెట్టింది. కేవలం స్థానిక సంస్థలు తీర్మానంతో చట్టాన్ని సవరించాలని అందులో పొందుపరించింది. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగలేనందున దీన్ని సవరిస్తూ స్థానిక సంస్థలు లేదా పర్సన్‌ ఇన్‌ఛార్జి లేదా సుమోటోగా సీఆర్డీయే చట్టంలో మార్పులు చేయవచ్చంటూ ఈ ప్రభుత్వం సవరణ చేస్తూ యాక్ట్‌ 13ని తీసుకు వచ్చింది.

2) ఇక రెండో సవరణ ఏంటంటే గతంలో సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌లో నాలుగు జోన్లు ఉంటే.. కొత్తగా ఐదో జోన్‌ను ఈప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఐదో జోన్‌లోనే పేదలకు ఇళ్లస్థలాలను కేటాయించింది.

3) ఇక మూడో సవరణ, పాత సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌లో ల్యాండ్‌ అలాట్‌మెంట్‌ రూల్స్‌ ప్రకారం ఒక ఇల్లు కట్టుకుంటే ఉండాల్సిన కనీస స్థలం 100 గజాలు అని ఉంది. అంటే.. ఈడబ్ల్యూఎస్‌కింద ఇళ్లు మంజూరుకు ఈ నిబంధన అడ్డంకి అని, అంటే దాదాపుగా పేదవాళ్లకి ఇల్లు ఇవ్వడం అనేది కుదరంటూ దీన్ని మారుస్తూ ఇప్పటిక ప్రభుత్వం చట్టానికి సవరణ చేసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేలా ఆ రూల్స్‌లో మార్పు చేసింది.

4) అలాగే అప్పటి ప్రభుత్వం చేసిన సీఆర్డీయే యాక్ట్‌లో కేవలం హౌసింగ్‌ అని మాత్రమే పొర్కొన్నారు. అంటే ఇళ్ల నిర్మాణాన్ని గురించి ప్రస్తావించింది. ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వకుండా ఇంటి నిర్మాణాలు ఎలా సాధ్యం అనేది ఈ ప్రభుత్వం వేసిన ప్రశ్న. పేదవాళ్లు అమరావతి రాకూడదనే ఉద్దేశంతోనే పాత చట్టంచేశారని వైసీపీ పలుమార్లు విమర్శలు కూడా చేసింది. అందుకే దీన్ని సవరిస్తూ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం అనే రెండు పదాలనూ సీఆర్డీయే చట్టంలో జోడించింది.

అయితే వీటిని సవాల్‌ చేస్తూ పెద్ద ఉత్తున పిటిషన్లు ఇటు హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులోనూ దాఖలయ్యాయి. అయితే స్టే ఇవ్వడానికి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి రెండు చోట్లా న్యాయస్థానాలు అంగీకరించలేదు. చట్ట సవరణకు సంబంధించిన యాక్ట్‌ 13లో వివిధ అంశాలమీద, అలాగే ఇంటిస్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోమీద ఈ పిటిషన్లు వేశారు. మళ్లీ తాజాగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఒకే అంశంమీద సుప్రీంకోర్టులో ఒక అభిప్రాయం వచ్చాక మళ్లీ మళ్లీ హైకోర్టులో ఎలా వేస్తారని ప్రభుత్వం వాదిస్తోంది. ఈకేసుల అంశాన్నే ఇవాళ ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ సందర్భంగా వెంకటపాలెం సభలో సీఎం జగన్‌ ప్రస్తావించారు.

“ఇళ్లపట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి… పేదల ఇళ్లు నిర్మాణానికి కూడా అడ్డుతగిలేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వీరు ఎక్కని గడపా లేదు. దిగని గడపా లేదు. కలవని కేంద్ర మంత్రీ లేడు, కేంద్ర సెక్రటరీ కూడా లేడు. ఇంతమందిని కూడా కలిసి అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కూడా కేసు వేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా ఉండదు’’ అంటూ సీఎం అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి లబ్ధిదారునికి ఇచ్చిన మోడల్‌ హౌస్‌ నిర్మాణాన్ని కేవలం నాలుగు రోజుల వ్యవధిలో అధికారులు పూర్తిచేయడం, వారి వేగానికి అద్దంపట్టింది. ప్రిఫాబ్రికేటెడ్‌ టెక్నాలజీని వాడుకుని, ఆప్షన్‌-3 కింద ప్రభుత్వమే వాటిని నిర్మించిన ఇచ్చేలా యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లూ చేసింది. మరి ఈ పోరాటంలో గెలిచేది ఎవరు? అమరావతి ఆందోళనకారులా? పేదల ఇళ్లా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..