Snake: రెండు తలల పాము ఇంట్లో ఉంటే సిరిసంపదలు పొంగిపోర్లుతాయా..?
ఈ పాము ఇప్పుడు ఆపదలో ఉంది. కారణం దాని చుట్టూ జరుగుతోన్న ప్రచారం. ఈ పాము ఉంటే గుప్తనిధులు కనిపెట్టడం ఈజీ అవుతుందని.. సిరిసంపదలు కలిసి వస్తాయని.. విపరీతమైన ప్రచారం ఉంది. విదేశాల్లో ఈ పాములకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. అక్రమ రవాణా కూడా జరుగుతోంది. ఈ పాము గురించి అసలు విషయాలు తెలుసుకుందాం పదండి...
స్నేక్ క్యాచర్స్ తప్పితే…. పాములు అంటే భయపడనివారు ఎవరూ ఉండరు. కొందరైతే పాము కనపడితే పరుగులు తీస్తారు. ఇంకొందరు పాము ఫోటో కనపడినా భయపడతారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓ పాము కోసం ఇప్పుడు విపరీతంగా వెతుకులాట సాగుతోంది. అది దొరికితే తమ లక్ తిరిగిపోతుందని భావిస్తారు. కారణం ఆ పాముకు మార్కెట్లో ఉన్న డిమాండ్. ఆ స్నేక్ చుట్టూ ఉన్న ప్రచారం. ఆ పాము మరేదో కాదు రెండు తలల పాము. ఈ పాముకు ఇంత డిమాండ్ ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఈ పాము ఇంట్లో ఉంటే.. కుబేరులు అవుతారని తాంత్రిక పూజలు చేసేవారు నమ్మిస్తూ ఉంటారు. ఇక ఈ పాము మాంసం తింటే.. లైంగిక శక్తి అపరిమితమంగా పెరుగుతుందని.. హాంగ్‌కాంగ్, చైనా దేశాల్లో నమ్ముతారు. అక్కడ పలు రకాల వంటల్లో దీని మాంసాన్ని వాడుతారు. పలు రకాల ఔషదాల్లో సైతం వినియోగిస్తారని.. ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులు నయం కోసం ఈ పాము ఉపయోగపడుతుంది విపరీతమైన ప్రచారం ఉంది. అందుకే ఈ పాములకు అంత డిమాండ్. లక్షలు.. కొన్నిసార్లు కోట్లలో కూడా ఈ పాముల కోసం బేరసారాలు జరుగుతూ ఉంటాయి.
ఈ పాము చాలా అమాయకమైనది. దీన్ని రెండ్ శాండ్ బోవా అని అంటుంటారు. ఈ పాము విషపూరితమైనది అస్సలు కాదు. ఇంకా చెప్పాలంటే కాటు కూడా వేయదు. మట్టి బొరియల్లో నివాసం ఉంటాయి. కీటకాలు, ఎలుకలు, బల్లులు వంటివాటిని ఆహారంగా తీసుకుంటాయి. అసలు ఈ పాముకు రెండు తలలే ఉండవ్.. ఏదైనా అపాయం అనిపించినప్పుడు.. ఈ పాము తోకను సైతం నోరులై పైకి లేపుతుంది. అందుకే దాన్ని రెండు తలలు ఉంటాయ్ అనుకుంటారు. 2 నుంచి 3 మీటర్ల వరకు పెరిగే ఈ పాములు.. ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయి. ఈ జాతి ఆడపాములు 10 నుంచి 15 వరకు పిల్లల్ని పెడతాయి.
ఇకపోతే ఈ పాములు ఇంట్లో ఉంటే ఎలాంటి భోగభాగ్యాలు కలగవు. అదంతా తప్పుడు ప్రచారం. ఈ పాము క్రయవిక్రయాలు జరిపడం.. అక్రమ రవాణా చేయడం తీవ్రమైన నేరం. అందుకే అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఈ పాములు ఎక్కడైనా కనిపించినా.. ఎవరైనా వాటిని బంధించినట్లు తెలిసినా.. టోల్‌ఫ్రీ నంబర్ 18004255364కు కాల్ చేసి తెలియజేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి