Rain Alert: అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుపానుగా మారుతుందని స్పష్టం చేసింది. ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నప్పటికీ..

Rain Alert: అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Follow us

|

Updated on: May 24, 2024 | 9:13 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుపానుగా మారుతుందని స్పష్టం చేసింది. ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నప్పటికీ.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పేమీ లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షంతోపాటు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

వాయుగుండంగా మారనున్న బలమైన అల్పపీడనం కారణంగా.. రెండు రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇక.. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే.. శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతోపాటు పలు జిల్లాల్లోనూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం.. వాయుగుండంగా మారునుండడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడనున్నట్లు వాతావరణశాఖ చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందంది. అటు.. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు