Raisi Helicopter: నాడు వైఎస్సార్‌, నేడు రైసీని పొట్టనబెట్టుకున్న బెల్..

Raisi Helicopter: నాడు వైఎస్సార్‌, నేడు రైసీని పొట్టనబెట్టుకున్న బెల్..

Anil kumar poka

|

Updated on: May 24, 2024 | 9:59 AM

హెలికాప్టర్ ప్రమాదంలో తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్ అబ్దుల్లాహియన్‌లు మృతిచెందారు. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ మాత్రమే ప్రమాదానికి గురి కావడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా..? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పురాతన హెలికాప్టరే రైసీని బలితీసుకుందా? అన్న కోణం కూడా వినిపిస్తోంది.

హెలికాప్టర్ ప్రమాదంలో తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్ అబ్దుల్లాహియన్‌లు మృతిచెందారు. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ మాత్రమే ప్రమాదానికి గురి కావడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా..? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పురాతన హెలికాప్టరే రైసీని బలితీసుకుందా? అన్న కోణం కూడా వినిపిస్తోంది. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను అమెరికా కంపెనీ బెల్‌ తయారు చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. నలభై ఏళ్ల నాటి హెలికాప్టర్‌ అది. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. 1979 నాటి ఇస్లామిక్‌ విప్లవానికి ముందు ఇరాన్‌ చివరి రాజు షా మహ్మద్‌ రెజా పహ్లావీ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. తర్వాత అమెరికా ఆంక్షల కారణంగా కొత్త విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు, పాత వాటికి విడిభాగాల సేకరణ కష్టమైంది.

ఈ హెలికాప్టర్‌ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఆదివారం కూలిన బెల్‌ 212 హెలికాప్టర్‌ ను దృశ్య స్పష్టత ఉన్నప్పుడే విహరించేలా దీన్ని రూపొందించారు. అంటే.. తన సీటు నుంచి పరిసరాలను చూడగలిగే సామర్థ్యంపైన ఆధారపడి మాత్రమే పైలట్‌ ఈ హెలికాప్టర్‌ ను నడపగలుగుతారన్నమాట. ఆదివారం నాటి ప్రమాద ఘటనా స్థలిలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్య స్పష్టత చాలా తక్కువగా ఉంది. ఇరాన్‌ వాయు రవాణా భద్రత చరిత్ర చాలా పేలవంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్‌ విమానయాన, హెలికాప్టర్‌ సంస్థలు.. తమ వద్ద ఉన్న హెలికాప్టర్లలో కొన్నింటిని భాగాలుగా విడగొట్టి, మిగతావాటికి అమరుస్తున్నాయి. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిలో కొన్ని భాగాలను ఇరాన్‌ తయారుచేస్తోంది. వాటి నాణ్యత ప్రశ్నార్థకం. ఇరాన్‌లోని అగ్రశ్రేణి విమానయాన సంస్థలు వాడుతున్న విమానాల సగటు వయసు 20 ఏళ్లు. కొన్ని హెలికాప్టర్‌లయితే 30 ఏళ్ల కిందటివి కావడం గమనార్హం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.