Andhra Pradesh: జాతరలో అశ్లీల నృత్యాల ప్రదర్శన.. తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికుల ఆగ్రహం..

జాతరలు, తిరునాళ్లు, ఏవైనా పండుగల సమయంలో పల్లెల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట గ్రామాల్లో రికార్డింగ్ డ్యాన్స్ లు నిర్వహించే వారు. కొన్ని సార్లు డ్యాన్స్ బేబి డ్యాన్స్ పేరుతో..

Andhra Pradesh: జాతరలో అశ్లీల నృత్యాల ప్రదర్శన.. తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికుల ఆగ్రహం..
Obscene Dances
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 06, 2022 | 12:52 PM

జాతరలు, తిరునాళ్లు, ఏవైనా పండుగల సమయంలో పల్లెల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట గ్రామాల్లో రికార్డింగ్ డ్యాన్స్ లు నిర్వహించే వారు. కొన్ని సార్లు డ్యాన్స్ బేబి డ్యాన్స్ పేరుతో అశ్లీల నృత్యాలను ప్రదర్శించేవారు. రానురాను వీటిపై నిషేధం విధించారు. ఎప్పటినుంచో నిషేధం ఉన్నప్పటికి.. కొంతకాలంగా రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్య ప్రదర్శనలు ప్రదర్శించకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో యువత చెడు వ్యసనాలకు త్వరగా అలవాటుపడుతుండటంతో అశీల్లనృత్య ప్రదర్శలు మొదలైన వాటిపై నిషేధం విధించారు. అయినా సరే ఇప్పటికి కొన్నిచోట్ల జాతరల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికి, పోలీసులు కొన్ని సందర్భాల్లో స్పందించి అలాంటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నప్పటికి, మరి కొన్ని సార్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కోసారి అయితే స్థానిక రాజకీయ నాయకులో లేదా, పలువురు ప్రముఖుల ఒత్తిడిలకు తలొగ్గి అశీల్ల నృత్య ప్రదర్శనలను పోలీసులు చూసీ చేడనట్లు వదిలేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అశ్లీల నృత్యాలను ప్రదర్శించడం పలు విమర్శలకు దారితీసింది.

కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సూరవరపు వారి వీధిలోని అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాల స్టేజ్ ని ఏర్పాటు చేసి అశ్లీల నృత్యాలను నిర్వహించడం పై స్ధానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదని, అసలు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు. ఈ అశీల్ల నృత్యాల ప్రదర్శన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ నివాసం ఉంది. మరోవైపు జాతర సందర్భంగా ఇక్కడ విధుల కోసం నియమించిన కానిస్టేబులం అక్కడే ఉన్నప్పటికి స్పందించలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కొంతమంది ప్రలోభాలకు లోబడి పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇలా ఉండగా.. కొంతమంది యువకులు అశ్లీల నృత్య ప్రదర్శనను సెల్ ఫోన్ లో రికార్డింగ్ చేస్తుంటే వారి నుంచి నిర్వహకులు ఫోన్లు లాక్కున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పిఠాపురం మంగాయమ్మరావు పేటలో వారంరోజుల క్రితం జరిగిన జాతరలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఒక యువకుడుని కత్తితో పొడవుగా.. తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి నేర ఘటనలు ఎన్నో జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..