AP Weather: ఏపీ వాసులకు అలెర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దసరా రోజున కురిసిన వర్షంతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .

AP Weather: ఏపీ వాసులకు అలెర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
AP Weather Report
Follow us
Surya Kala

|

Updated on: Oct 06, 2022 | 1:08 PM

ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా  దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దసరా రోజున కురిసిన వర్షంతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు, గుంటూరు, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..