Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇంత దారుణమా.. ప్రాణాలు తీస్తున్న వడ్డీ వ్యాపారులు.. వెలుగులోకి భయంకర నిజాలు..

వ్యాపారం కోసం తీసుకున్న అప్పు భారమైంది. అప్పు తీర్చడానికి సమయం కావాలని అడిగినా.. వడ్డీ వ్యాపారులు వినలేదు. యమకింకరుల వలే రెచ్చిపోయారు. పాశవికంగా దాడులకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల దాడిలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.

మరీ ఇంత దారుణమా.. ప్రాణాలు తీస్తున్న వడ్డీ వ్యాపారులు.. వెలుగులోకి భయంకర నిజాలు..
Money
Follow us
T Nagaraju

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 05, 2025 | 6:20 PM

వ్యాపారం కోసం తీసుకున్న అప్పు భారమైంది. అప్పు తీర్చడానికి సమయం కావాలని అడిగినా.. వడ్డీ వ్యాపారులు వినలేదు. యమకింకరుల వలే రెచ్చిపోయారు. పాశవికంగా దాడులకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల దాడిలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. సత్తెనపల్లికి చెందిన తరుణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు హోటల్ బిజినెస్ కూడా చేస్తుంటాడు. కొద్దీ కాలం క్రితం బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంకు చెందిన వడ్డీ వ్యాపారి చిన మాబు అలియాస్ నన్నే వద్ద మూడు నెలల క్రితం నలబై లక్షల రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. వారం రోజుల క్రితం నన్నే నలభై లక్షలకు వడ్డీతో కలిపి కోటి రూపాయలు ఇవ్వాలని అడిగాడు. డబ్బులు తరుణ్ ఇవ్వలేకపోవడంతో అప్పటి నుండి నన్నే తరుణ్ ను వేధిస్తున్నాడు. వారం రోజుల క్రితం నన్నే మరో ముగ్గురు కలిసి తరుణ్ ను కిడ్నాప్ చేశారు. కారులో వివిధ చోట్లకు తిప్పి తీవ్రంగా కొట్టారు. చేతిపై మణికట్టు వద్ద మేకును కొట్టారు. మలద్వారం గుండా ఇనుప రాడ్ ను దించారు. అంతే కాకుండా డబ్బులు ఇవ్వకపోయినా, పోలీసులకు చెప్పినా తరుణ్ ను చంపేస్తామంటూ తండ్రి అంజినేయ శ్రీనివాస్ కు ఫోన్ చేసి బెదిరించారు.. దీంతో ఆయన చేసేదేం లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తరుణ్ ను పేరేచర్లలో బంధించినట్లు గుర్తించి రైడ్ చేసి నిందితులను పట్టుకున్నారు. బాధితుడు తరుణ్ ను మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భయాందోళనకు గురయిన తరుణ్ బంధువులు ఈ సంఘటన మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

మరోక ఘటనలో సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందిన అంజిబాబు రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో సత్తెనపల్లికి చెందిన వడ్డీ వ్యాపారి మహ్మద్ సుభాని అలియాస్ సుప్రీంకు పన్నెండు లక్షలు బాకీ పడ్డాడు. ఈ అప్పు తీర్చులేకపోవడంతో అంజిబాబు హైదరాబాద్ మకాం మార్చాడు. అప్పటి నుండి సుప్రీం..‌ అంజిబాబు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపధ్యంలో నాలుగు రోజుల క్రితం అంజిబాబు పిడుగురాళ్లలోని రామారావు ఇంటికి వచ్చినట్లు సుప్రీంకు తెలిసింది. సుప్రీం మరొక ఐదుగురుని తీసుకొని రామారావు ఇంటికి వెళ్ళాడు. అక్కడున్న అంజిబాబు, గగన్ రెడ్డి లను కారులో ఎక్కించుకుని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ అంజిబాబు పై కత్తులతో దాడి చేశారు. పురుగు మందు త్రాగించారు. అడ్డుకోబోయిన గగన్ రెడ్డిపై కూడా దాడి చేశారు. అయితే అదే సమయంలో కొంతమంది స్థానికులు అటు రావడంతో సుప్రీం అతని అనుచరులు పారిపోయారు. అంజి బాబు ను గుంటూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ రెండు కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉండటంతో పోలీసులు నోరు మెదపడం లేదు.

డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
ఫుల్లుగా మద్యం తాగి పరీక్షహాలుకు వచ్చిన 10th విద్యార్ధి.. ఆ తర్వత
ఫుల్లుగా మద్యం తాగి పరీక్షహాలుకు వచ్చిన 10th విద్యార్ధి.. ఆ తర్వత
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే
ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే