- Telugu News Photo Gallery Political photos Chandrababu Naidu's Delhi Trip: Meets Amit Shah, Seeks AP Funds
కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, అమరావతి ప్రాజెక్టులు, విభజన అనంతర పెండింగ్ అంశాలపై చర్చించారు. టీడీపీ ఎంపీలు కూడా ఆయనతో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
SN Pasha |
Updated on: Mar 05, 2025 | 8:35 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలు, అమరావతి, పోలవరం తదితర అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సీఎం రమేశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

కేంద్ర మంత్రులను కలిసి సమయంలో వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు కూడా అందజేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రావాల్సిన నిధులు వచ్చేలా చూస్తామని కూడా కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులను కలిసిన టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సీఎం రమేశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి సహకరించాలని అమిత్ షాను ప్రత్యేకంగా కోరినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముఖ్యంగా ఏపీకి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రోజు(బుధవారం) గన్నవరం నుంచి బయలుదేరి 1.30 గంటలకు చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు.





























