వారు బైక్‌పై ఇద్దరు వస్తున్నా.. రాత్రి సమయం అని ఇతనికి లిఫ్ట్ ఇచ్చారు.. కానీ కాసేపటికే..
రాత్రి వేళ బస్సు కోసం ఎదురు చూసిన యువకుడు… ఇంటికి త్వరగా చేరాలనే ఆశతో బైక్‌పై వెళ్లేవారిని లిఫ్ట్ అడిగాడు. జాలితో ఆపిన అన్నదమ్ములు… అదే వారి చివరి ప్రయాణమైంది. కాసేపట్లో ఇంటికి వస్తానన్న మాట… క్షణాల్లో విషాదంగా మారింది. లిఫ్ట్ ఇచ్చిన ప్రయాణం… ఇద్దరి ప్రాణాలను తీసింది.

రాత్రి సమయం ఎంతసేపు చూసినా బస్సు రాలేదు. ఆటో కూడా ఏదీ అందుబాటులో లేదు. తొందరగా ఇంటికి వెళ్లాలనే ఆశ.. ఇంతలో బైక్‌పై వస్తున్న ఇద్దరు అన్నదమ్ములను లిఫ్ట్ అడిగాడు. బైక్ పై ఇద్దరు వస్తున్నప్పటికీ రాత్రి వేళ కావడంతో పోనీలే పాపం అని వారు బైక్ ఆపి.. ఇతగాడికి లిఫ్ట్ ఇచ్చారు . అయితే లిఫ్ట్ ఇచ్చిన కాసేపటికి లిఫ్ట్ అడిగిన యివకుడితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న అన్నదమ్ముల్లో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. మరో యువకుడు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు. కాసేపట్లో ఇంటికి వస్తాను అని చెప్పిన బిడ్డ శవమై హాస్పిటల్ ఉన్నాడని తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి టోల్ ప్లాజా సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు హాస్పిటల్ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆత్మకూరు నుంచి రాంపల్లికి పని నిమిత్తం వెళ్లిన అరుణ్, తిరుమల అనే ఇద్దరు అన్నదమ్ములు ఆత్మకూరులో పని ముగించుకుని రాత్రి సమయంలో బైక్‌పై ఇంటికి బయలుదేరారు. అయితే బైక్‌పై వస్తున్న ఇద్దరిని కరటంపాడు వద్ద శానంపూడి మనోజ్ కుమార్ అనే యువకుడు లిఫ్ట్ అడిగి వారి బైక్‌పై ఎక్కాడు. రాత్రి సమయం కావడంతో ఇద్దరు అన్నదమ్ములు కలిసి లిఫ్ట్ ఇచ్చి అక్కడి నుంచి ముగ్గురు బయలుదేరారు. బైక్‌పై ముగ్గురు బయలుదేరిన కాసేపటికే ఎదురుగా వస్తున్న గేదెలు గుంపును బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనోజ్, అరుణ్ అనే ఇద్దరు మృతి చెందగా.. తిరుమల అనే మరొక యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనము ఎక్కిన మనోజ్ మరణ వార్త పలువురిని కలిచివేసింది. బైక్ ఎక్కిన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం జరగడం.. ప్రాణాలు పోవడం అంతా ఒక మాయలాగా ఉంది అంటూ బంధువులు స్థానికులు వాపోతున్నారు.
Also Read: నా భార్యకు అబార్షన్ అయినప్పుడు ఆ హీరో ఫోన్ చేసి చెప్పిన మాటకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి..
