Watch : పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి.. శ్రేయస్ అయ్యర్ సోదరి వీడియోనే శాపమైందా ?
Watch : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. వరుసగా రెండోసారి ప్లేఆఫ్స్ చేరి తీరాలని పట్టుదలగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఆశలు ఆఖరి నిమిషంలో గల్లంతయ్యాయి. గత సీజన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఏకంగా 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్ చేరిన పంజాబ్, ఈసారి కూడా అదే రేంజ్‌లో టోర్నీని ప్రారంభించింది.

Watch : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. వరుసగా రెండోసారి ప్లేఆఫ్స్ చేరి తీరాలని పట్టుదలగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఆశలు ఆఖరి నిమిషంలో గల్లంతయ్యాయి. గత సీజన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఏకంగా 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్ చేరిన పంజాబ్, ఈసారి కూడా అదే రేంజ్‌లో టోర్నీని ప్రారంభించింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను కోల్పోయింది. సరిగ్గా పంజాబ్ జట్టు టోర్నీ నుంచి అవుట్ అవ్వగానే.. గతంలో శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. నాడు ఆమె చేసిన వెటకారం, నేడు పంజాబ్ జట్టుకే శాపం అయి కూర్చుంది.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమైన మొదటి నెల రోజులు పంజాబ్ కింగ్స్ ఆడిన ఆట చూసి మిగతా జట్లు వణికిపోయాయి. టోర్నీలో ఆడిన మొదటి 7 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా ఓడిపోకుండా దూసుకుపోయిన ఏకైక జట్టు పంజాబే. ఆ 7 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లను క్లీన్‌గా గెలిచిన పంజాబ్.. గెలవలేకపోయిన ఏకైక మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరగాల్సింది. ఆ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడటంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ (1-1 పాయింట్) కేటాయించారు. అప్పట్లో పంజాబ్ ఉన్న ఫామ్‌కు ఆ మ్యాచ్ జరిగి ఉంటే కచ్చితంగా గెలిచేదనే నమ్మకం అందరిలోనూ ఉండింది.
కోల్‌కతాతో మ్యాచ్ రద్దయి రెండు జట్లకు ఒక్కో పాయింట్ రాగానే, శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ పంజాబ్ సపోర్టర్లతో కలిసి ఒక సరదా వీడియో చేసింది. ఆ సీజన్ ఆరంభంలో కేకేఆర్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా ఓడిపోయి కనీసం ఖాతా కూడా తెరవలేదు. పంజాబ్‌తో మ్యాచ్ రద్దు కావడం వల్లే కేకేఆర్‌కు మొదటి పాయింట్ దక్కింది. దీంతో శ్రేష్ఠ అయ్యర్ తన స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తూ “ఆ ఒక్క పాయింట్‌ను కేకేఆర్‌కు మేమే దానం చేశాం” అంటూ ఇన్ స్టాలో కేకేఆర్ జట్టును విపరీతంగా ట్రోల్ చేసింది. అప్పట్లో ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో ఆమె డిలీట్ చేసింది. కానీ ఇప్పుడు పంజాబ్ సరిగ్గా ఆ ఒక్క పాయింట్ వల్లే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో, నెటిజన్లు ఆ పాత వీడియోను బయటకు తీసి శ్రేష్ఠ అయ్యర్, పంజాబ్ కింగ్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
If only Punjab didn’t lose that 1 point…. They’re ahead in NRR as well. pic.twitter.com/aDSpTLmRSI
— arfan (@Im__Arfan) May 24, 2026
మే 24న జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాజస్థాన్ గెలవడంతో పంజాబ్ కింగ్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికను ఒకసారి గమనిస్తే.. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరగా, పంజాబ్ కింగ్స్ 15 పాయింట్ల వద్దే ఆగిపోయింది. అంటే ఇరు జట్ల మధ్య తేడా కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.
ఒకవేళ నాడు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాకుండా ఉండి, పంజాబ్ గెలిచి ఉంటే ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉండేవి. అప్పుడు రాజస్థాన్, పంజాబ్ జట్లు సమాన పాయింట్లతో నిలిచేవి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం అప్పుడు నెట్ రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకునేవారు. పంజాబ్ కింగ్స్ నెట్ రన్‌రేట్ (+0.309) రాజస్థాన్ రన్‌రేట్ (+0.189) కంటే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి పంజాబ్ సులభంగా ప్లేఆఫ్స్ చేరేది, రాజస్థాన్ అవుట్ అయ్యేది. నాడు కేకేఆర్‌కు దానం చేశామంటూ నవ్వుకున్న ఆ ఒక్క పాయింటే.. నేడు పంజాబ్ పాలిట శాపంగా మారి టోర్నీ నుంచి బయటకు పంపేసింది. దీన్నే కర్మ అంటారంటూ సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
