AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడతపై క్లారిటీ వచ్చేసింది.. అకౌంట్లోకి వచ్చేది అప్పుడే.. కేంద్రం రెడీ..

పీఎం కిసాన్ 24వ విడత సొమ్ము విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. జూన్‌లో 23వ విడత సొమ్మును విడుదల చేసిన విషయం తెలిసిందే . దీంతో 24వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడతపై క్లారిటీ వచ్చేసింది.. అకౌంట్లోకి వచ్చేది అప్పుడే.. కేంద్రం రెడీ..
Pm Kisan
Venkatrao Lella
|

Updated on: Aug 16, 2026 | 3:38 PM

Share

పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతీ ఏడాది రూ.6 వేలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున అందిస్తోంది. మూడు విడతలుగా వీటిని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. అయితే 23వ విడత నిధులను జూన్‌లో ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి విడుదల చేసింది. దీంతో 24 విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ పనులు స్టార్ట్ కావడంతో కేంద్రం నుంచి సాయం ఎప్పుడు అందుతుందనే విషయంపై వేచి చూస్తున్నారు. అయితే తర్వాతి విడత డబ్బులు అక్టోబర్‌లో జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అధికారిక తేదీని ప్రకటించనప్పటికీ.. గత హిస్టరీని పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.

24వ విడత ఎప్పుడు ఎప్పుడంటే..?

ఈ ఏడాది జూన్ 20వ తేదీన ప్రధాని మోదీ పీఎం కిసాన్ 23వ విడత నగదును రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 94.4 మిలియన్లకుపైగా రైతుల అకౌంట్లలో రూ.18,880 కోట్లను విడుదల చేశారు. సాధారణంగా కేంద్రం ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి జమ చేయాలనే నిబంధన పెట్టుకుంది. దీని ప్రకారం చూస్తే అక్టోబర్‌లో రిలీజ్ చేసే అవకాశముంది. ప్రభుత్వం త్వరలోనే ఒక తేదీని ప్రకటించే అవకాశముంది. అయితే పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా 5 పనులు ముందుగానే చేయాలి. ఈకేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. కేవైసీ అసంపూర్తిగా ఉంటే డబ్బులు జమ అవ్వవు. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పూర్తి చేయవచ్చు. అలాగే మీ రికార్డులు, అర్హత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.

ఈ సమస్యలు ఉన్నాయా..?

భూమి రికార్డు ఆధారంగా ఈ పథకం ప్రయోజనాలను కేంద్రం అందిస్తోంది. దీంతో భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. పేరుతో తప్పు ఉన్నా, భూరికార్డుల్లో ఏదైనా సమస్య ఉన్నా వాటిని సరిచేసుకోవాలి. వారసత్వంగా భూమి పొందినా, కుటుంబంలో భూమిని విభజించుకున్నా రికార్డులు అప్డేట్ చేసుకోవాలి. ఇక బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ వివరాలను చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉందా.. లేదా అనేది తనిఖీ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతా కేవైసీ కూడా పూర్తి చేయాలి. ఇక లబ్దిదారుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్లోకి వెళ్లి మీ గ్రామం, బ్లాక్, జిల్లా, రాష్ట్రం సెలక్ట్ చేసుకుని చూడవచ్చు. ఇక పీఎం కిసాన్ స్టేటస్ తనిఖీలు చేసుకోవాలి. అర్హతలో మార్పులు, రికార్డుల్లో పొరపాటు, బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ కాకపోవడం, భూమి రికార్డులను అప్డేట్ చేసుకోకపోవడం, కేవైసీ పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో పీఎం కిసాన్ నిలిచిపోవచ్చు.

Follow Us