Watch Video: వామ్మో.. చిరుత పులొచ్చింది.. శ్రీశైలం పరిసరాల్లో టెన్షన్ టెన్షన్.. వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులుల సంచారం కలవరపెడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుతపులులు కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Leopard wanders video viral: తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులుల సంచారం కలవరపెడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరుతపులులు కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచారం ఒక్కసారిగా అలజడి రేపింది. శ్రీశైలం కన్నీరుమల్లమ్మ సమీపంలోని మట్టిరోడ్డులో చిరుతపులి సంచరిస్తూ కనిపించింది. మట్టిరోడ్డు నుంచి అటవీ ప్రాంతం లోపలికి వెళ్తూ చిరుతపులి స్థానికులకు తారసపడింది. చిరుతపులిని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. కాగా.. గత రెండురోజులుగా అర్ధరాత్రి సమయంలో రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు, అధికారులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చిరుత పులి సంచరిస్తుందని.. జాగ్రత్తగా ఉండాలంటూ మైక్ ద్వారా భక్తులను, స్థానికులను శ్రీశైలం దేవస్థానం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కాగా.. రెండు రోజులుగా చిరుత సంచరిస్తుండటంతో అటవీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. చిరుతను బంధించేందుకు, లేదా అటవీ ప్రాంతంలోకి తిరిగి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా.. శ్రీశైలం ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మట్టిరోడ్డులో చిరుత వెళ్లడాన్ని కొందరు రికార్డు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.




వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..