Nitin Gadkari: ఆంధ్రప్రదేశ్‌లో రూ. 5 లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుడ్‌న్యూస్ చెప్పారు. ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఏపీలో హైవేలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. హైవే ప్రాజెక్టులన్నీ వచ్చే రెండేళ్లలోనే కంప్లీట్ చేస్తామన్నారు.

Nitin Gadkari in AP: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుడ్‌న్యూస్ చెప్పారు. ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఏపీలో హైవేలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. హైవే ప్రాజెక్టులన్నీ వచ్చే రెండేళ్లలోనే కంప్లీట్ చేస్తామన్నారు. రాబోయే మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌కు మూడువేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. రాజమండ్రిలో గురువారం పర్యటించిన నితిన్ గడ్కరీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. హైవే ప్రాజెక్టులు, ఐదు ఫ్లైఓవర్లకు ఫౌండేషన్ స్టోన్స్ వేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్ హైవేపై నిర్మిస్తున్నారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబోయే హైవేల ప్రాజెక్టులన్నింటినీ 2024 నాటికి పూర్తిచేసి తీరుతామన్నారు. ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే మరిన్ని ప్రాజెక్టులు కేటాయిస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. లాజిస్టిక్ పార్క్, భువనేశ్వర్ నుంచి భోగావరం వరకు ఆరు వరుసల హైవే నిర్మాణం, విజయవాడ ఈస్ట్ బైపాస్, రాజమండ్రి-కాకినాడ కెనాల్ రోడ్ మంజూరు చేస్తామన్నారు. ఏపీలో మొత్తం రూ.5లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు.
నౌకాయానంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత కీలకమైన రాష్ట్రం అన్నారు నితిన్ గడ్కరీ. ఒక్క మాటలో చెప్పాలంటే దేశానికి ఆంధ్రా చాలా ముఖ్యమైన రాష్ట్రం అన్నారు. ఎక్కువ సముద్రతీరం ఉండటంతో ఏపీ డెవలప్‌మెంట్‌కు పోర్టులు ఇంజిన్‌లా పనిచేస్తాయన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని ఈ సందర్భంగా గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్యరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న గడ్కరీకి రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, రాష్ట్ర అధికారులు, బీజేపీ నేతలు కేంద్ర మంత్రి గడ్కరీకి సాదర స్వాగతం పలికారు.




#ConnectingIndia With Prosperity!
Propelling growth & development in #AndhraPradesh, today laid the foundation stones for 8 National Highway Projects worth Rs. 3000 Cr. in Rajamahendravaram… pic.twitter.com/meS82DdwrI
— Nitin Gadkari (@nitin_gadkari) September 22, 2022
కాగా, జాతీయ రహదారి నంబర్ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించారు. అలాగే, వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ హైవేపై 4 లేనింగ్, రంపచోడవరం నుంచి కొయ్యూరి వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..