Weather: ఏపీలో వర్షాలు.. తెలంగాణలో చలి, మంచు.. తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

గల్ఫ్ ఆఫ్ మన్నార్ & పరిసర ప్రాంతాలపై తీవ్రఅల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. అటు తెలంగాణలో.. చలి, పొగమంచు ఉంటుందని వెల్లడించింది.

Weather: ఏపీలో వర్షాలు.. తెలంగాణలో చలి, మంచు.. తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Report
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 12, 2024 | 6:25 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వాతావరణ వ్యవస్థతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని వెల్లడించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే సూచనలకు దారితీసింది.

ముఖ్యంగా ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. >చిత్తూరు, తిరుపతి, అన్నమయ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయని, రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

తెలంగాణలో చలి… 

తెలంగాణలో రాగల 3 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువ నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు అక్కడక్కడ చలి గాలులు వీస్తాయని పేర్కొంది.

ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న బస్సు ప్రమాద దృశ్యాలు..!
ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న బస్సు ప్రమాద దృశ్యాలు..!
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..