Weather Report: ఇక నాన్‌స్టాప్.. వర్షాలు మొదలయ్యాయోచ్.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి.. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్టుతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి ఐదు రోజులపాటు వర్ష సూచన చేసింది.. తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Weather Report: ఇక నాన్‌స్టాప్.. వర్షాలు మొదలయ్యాయోచ్.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Rain Alert
Follow us

|

Updated on: Jun 27, 2024 | 8:51 AM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి.. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్టుతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి ఐదు రోజులపాటు వర్ష సూచన చేసింది.. తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. కాగా.. రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి.. హైదరాబాద్‌లో అక్కడక్కడ వర్షం కురస్తోంది..

అప్రమత్తంగా ఉండాలి..

గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారీ వర్షాల నేపధ్యంలో లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. శుక్రవారం మన్యం,అల్లూరి,విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
'మా బావ ప్రభాస్‌కు అభినందనలు'.. కల్కి సినిమాను చూసిన మోహన్ బాబు
'మా బావ ప్రభాస్‌కు అభినందనలు'.. కల్కి సినిమాను చూసిన మోహన్ బాబు