AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pinnelli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్‌.. అర్థరాత్రి నెల్లూరు జైలుకు తరలింపు

ఎన్నికల్లో జరిగిన దాడుల కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్ట్‌య్యారు. మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మీస్ చేయడంతో .. అరెస్ట్ చేసిన పోలీసులు మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు.

Pinnelli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్‌.. అర్థరాత్రి నెల్లూరు జైలుకు తరలింపు
Pinnelli Ramakrishna Reddy
Balaraju Goud
|

Updated on: Jun 27, 2024 | 7:35 AM

Share

ఎన్నికల్లో జరిగిన దాడుల కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్ట్‌య్యారు. మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మీస్ చేయడంతో .. అరెస్ట్ చేసిన పోలీసులు మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు.

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించారు మాచర్ల కోర్టు జడ్జి. పిన్నెల్లిపై నమోదైన నాలుగు కేసులను విచారించిన మాచర్ల కోర్టు.. రెండు కేసుల్లో బెయిల్‌, మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించింది. నంబూరి శేషగిరిరావు, సీఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించిన కోర్టు.. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది. దీంతో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు.

అంతకుముందు పిన్నెల్లి మధ్యంతర బెయిల్ డిస్మీస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. వెంటనే పిన్నేల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ సూచించింది హైకోర్టు. హైకోర్టు తీర్పుతో బుధవారం మధ్యాహ్నం నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం ఆయనను పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. గవర్నమెంట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు .. డిన్నర్ తర్వాత రాత్రి 10గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి మాచర్ల తరలించారు. కోర్టు దగ్గరకు తీసుకురాగానే ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆయన అనుచరులు, వ్యతిరేక వర్గం పిన్నెల్లి తీసుకొచ్చిన కారును చుట్టుముట్టారు. పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. పిన్నెల్లి అరెస్ట్‌తో వ్యతిరేక వర్గం బాణసంచాకాల్చి సంబరాలు చేసుకుంది. పిన్నెల్లి అనుకూల వర్గం మాత్రం పోలీసలుతో వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పిన్నెల్లి అనుచరులను అక్కడ నుంచి పంపించేశారు పోలీసులు.

మే 13 ఎన్నికల పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు పిన్నేలి. బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళ నిలదీయటంతో ఆమెను దుర్భాషలాడి దాడి చేశారు. దీనిపై రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లి,తో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దాదాపు వారం రోజుల పాటు పరారీలో తప్పించుకుని తిరిగారు పిన్నెల్లి. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ జూన్ 4వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలతో మాచర్లకు వెళ్లి ఎస్పీ ముందు హాజరయ్యారు. జూన్ 4న ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్ల నియామకానికి ఇబ్బంది లేకుండా ఆయనకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. జూన్ 13వరకూ మధ్యంతర బెయిల్‌ పొడిగించింది. తర్వాత మరోసారి ఆయన మధ్యంతర బెయిల్‌ని జూన్ 20 వరకు పొడిగిస్తూ విచారణకు ఆదేశించింది.

మే 14న పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడడంతో పాటు.. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడిచేయడంతో ఆయన గాయపడ్డారు. దీనిపై వీఆర్వో ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి అప్పటి నుంచి పరారీలో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..