AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం

గత ఆరు నెలల క్రితం మూడు చిరుత పులలను శేషాచలం అడవుల నుంచి తీసుకొని వచ్చి పచ్చర్ల సమీపంలోని నల్లమల అడవిలో వదిలి పెట్టినట్లు అ చిరుత పులులే ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం
Leopard
J Y Nagi Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 27, 2024 | 7:15 AM

Share

నంద్యాల జిల్లా మహానంది అలయ పరిసరాల్లో చిరుతపులి భయపెడుతోంది. ఆలయ సమీపంలోని గోశాల వద్ద చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వారం రోజులుగా మహానంది ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఆలయ అధికారులు. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

నంద్యాల జిల్లాలోని నల్లమల అడవి ప్రాంతంలో చిరుత పులులు హల్చల్ చేస్తూన్నాయి. ఎన్నడు లేని విధంగా మనషులపై దాడులు చెయ్యడం, చంపడం తీవ్ర కలకలం రేపుతుంది. పచ్చర్ల గ్రామానికి చెందిన మోహరూన్ బీపై దాడి చేసి చంపడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఇదే ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఐదుగురిపై దాడి చేసి నలుగురిని కాయపరచగా, ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. చిరుత భయంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మోహరున్ బీ కట్టెల కోసం అడవిలోకి వెళ్ళగా దాడి చేసి చంపింది. గతంలో మృతురాలి అక్కపై అంతకు ముందు వాళ్ళ కుటుంబానికి చెందిన మరో యువకుడిపై కూడా చిరుతు దాడి చేసింది. ఒకే కుటుంబంపై చిరుత కక్షగట్టి దాడి చేస్తుందని మృతురాలి బంధువులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చర్ల గ్రామంలో చిరతుపులి రోజు ఒక రకంగా ఎటో ఒకవైపు నుంచి దాడి చేయడంపై పచ్చర్ల గ్రామస్థులు అందోళనకు దిగారు. నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎలాగైన చిరుతపులిని త్వరగా పట్టుకుని తమ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. గంటకొద్ది ధర్నా చెయ్యడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఫారెస్ట్ అధికారులు చిరుతను త్వరలో పట్టుకుంటాం అని హామి ఇవ్వడంతో అందోళన విరమించారు.

పచ్చర్ల గ్రామం వద్ద పరిస్థితి ఇలా ఉంటే మరో ప్రక్క మహానంది ఆలయ పరిసరాల్లో పది రోజులుగా చిరుత సంచరిస్తూ భక్తులను, స్థానికులను తీవ్ర అందోళనకు గురి చేస్తోంది. ఆలయం అన్నదాన సత్రం, గోశాల, కరెంట్ అఫీసు, ఈశ్వర్ నగర్ తదితర పరిసరాల్లో సంచరించడం స్థానికులు గమనించారు. గోశాల వద్ద చిరుత సంచరించిన వీడియో సిసి కెమెరాలో స్పష్టంగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

గత ఆరు నెలల క్రితం మూడు చిరుత పులలను శేషాచలం అడవుల నుంచి తీసుకొని వచ్చి పచ్చర్ల సమీపంలోని నల్లమల అడవిలో వదిలి పెట్టినట్లు అ చిరుత పులులే ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడు లేని విధంగా చిరుతపులులు అడవిలో జంతులను వేటాడకుండా ఇలా మనషులపై దాడి చేయడం దారుణమని సబ్ డిఎఫ్ ఓ శ్రీనివాస రెడ్డి అన్నారు.

ఇక తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దేవనగరం గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ప్రజలు దాన్ని చూసి హడలిపోయారు. అయితే చిరుతపులి అకస్మాత్తుగా గ్రామ సమీపంలోని ఓ గుంతలో పడిపోయింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించేందుకు అటవీశాఖ సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రివేళ అది బయటకు రాకుండా గుంత చుట్టూ వలతో కట్టుదిట్టంగా కంచె ఏర్పాటు చేశారు. చిరుతపులిని రక్షించి అడవిలో విడిచి పెట్టేందుకు వీలుగా తిరుపతి నుంచి ప్రత్యేక రెస్క్యూ టీం వచ్చింది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుంది..చిరుతను పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారులు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..