AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: బస్సులో అనుమానాస్పదంగా నలుగురు పాసింజర్స్.. వాళ్ల లగేజ్ చెక్ చేయగా..

కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) జి. కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాహనాల తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఆ శాఖ సిబ్బంది  తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే..

Kurnool: బస్సులో అనుమానాస్పదంగా నలుగురు పాసింజర్స్.. వాళ్ల లగేజ్ చెక్ చేయగా..
Private Bus (Representative image )
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2024 | 11:46 AM

Share

కర్నూలు, ఫిబ్రవరి 2: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. అన్ని వాహనాలకు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆముక్తాడు టోల్‌ప్లాజా వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) జి. కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాహనాల తనిఖీలను ముమ్మరం చేసినట్లు ఆ శాఖ సిబ్బంది  తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. తనిఖీల్లో భాగంగా వెల్దుర్తి పోలీసులు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్తున్న బస్సులో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు నలుగురి వద్ద పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదును గుర్తించారు.

నలుగురిలో నంద్యాల నివాసి అమర్ ప్రతాప్ పవార్ వద్ద రూ.1, 20, 80,000 నగదు ఉన్నట్లు పోలీసు సిబ్బంది తెలిపారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు తమిళనాడుకు చెందినవారని వెల్లడించారు. వారిలో ఇద్దరు వ్యక్తులు వెంకటేష్ రాహుల్, సెంథిల్ కుమార్ కోయంబత్తూర్ వాసులు కాగా, శబరి రాజన్ సేలం పట్టణంలో నివసిస్తున్నారు. వెంకటేష్ రాహుల్ వద్ద నుంచి 3.195 కిలోల బంగారం, 19, 23, 500 నగదు సీజ్ చేశారు. సెంథిల్ కుమార్ వద్ద నుంచి 1.37 కిలోల బంగారం, రూ.44.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సేలం పట్టణానికి చెందిన శబరి రాజన్ 5 కిలోల బరువున్న వెండి బిస్కెట్లను గుర్తించారు. నలుగురు వ్యక్తులు సరైన పత్రాలు లేకుండా భారీగా బంగారం, వెండి, నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. పంచనామా రాసి దొరికిన సొత్తును విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖకు పంపారు. పట్టుబడిన బంగారం, వెండి మొత్తం నగదు, క్యాష్ కలిపి రూ. 4,59, 08, 300 విలువ ఉంటుందని ఆ శాఖ సిబ్బంది తెలిపారు.

సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదును గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆయన పేరును ఓ అవార్డుకు సిఫార్సు చేసినట్లు సమాచారం. వాహన తనిఖీల్లో వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ పి చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణగిరి ఎస్‌ఐ ఎం చంద్రశేఖర్‌రెడ్డి, సోషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఖాజా హుస్సేన్‌, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Kurnool Police

Kurnool Police

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా