Neeraja Reddy: భర్త వర్ధంతి రోజే.. ఇవాళ మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి అంత్యక్రియలు..

విధి, తలరాత ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేరు. భర్త వర్ధంతిని జరిపేందుకు వస్తూ భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, భర్త వర్ధంతి రోజు భార్య అంత్యక్రియలు జరుగుతూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి విషదానికి గురిచేసింది.

Neeraja Reddy: భర్త వర్ధంతి రోజే.. ఇవాళ మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి అంత్యక్రియలు..
Ex Mla Neeraja Reddy
Follow us
Basha Shek

|

Updated on: Apr 18, 2023 | 7:31 AM

విధి, తలరాత ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేరు. భర్త వర్ధంతిని జరిపేందుకు వస్తూ భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, భర్త వర్ధంతి రోజు భార్య అంత్యక్రియలు జరుగుతూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి విషదానికి గురిచేసింది. భర్త మాజీ ఎమ్మెల్యేగా హత్యకు గురైతే భార్య మాజీ ఎమ్మెల్యేగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం మరింత విషాదాన్ని నింపింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన పాటిల్ శేషిరెడ్డిది భూస్వామ్య కుటుంబం. ఇప్పటికీ వందలాది ఎకరాల పొలం ఉంది. అప్పట్లోనే శేశి రెడ్డి పీజీలో గోల్డ్ మెడలిస్ట్. కడప జిల్లాకు చెందిన హైకోర్టు జడ్జి జస్టిస్ రామచెన్నరెడ్డి కూతురు నీరజా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు కావడంతో అప్పటి సీనియర్ కాంగ్రెస్ నేత, ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి శేషిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1989లో పత్తికొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అప్పటికే నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాలు ఆయనను చుట్టుముట్టాయి. ఎన్నికల ప్రచారంలో ఉండగా 1996 ఏప్రిల్ 18న ఆయనను అతి కిరాతకంగా ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ తర్వాత నీరజ రెడ్డి రాజకీయ వారసత్వం తీసుకోవాల్సి వచ్చింది. టికెట్ రాకపోవడంతో 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎస్వీ సుబ్బారెడ్డి పై 2 వేల స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. పట్టు వదలకుండా 2009లో ఆలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అసెంబ్లీలో అడుగుపెట్టినా ఎక్కడ కూడా రాజకీయాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కొందరిని రాజకీయంగా విభేదించినప్పటికీ తన ఫoతా కొనసాగిస్తూ వచ్చింది. భర్త వర్ధంతికి రెండు రోజుల సమయం ఉండటంతో హైదరాబాదులో ఉంటున నీరజ ఫార్చునర్ కారులో స్వగ్రామానికి బయలుదేరి గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి. భర్త వర్ధంతి జరపాలని వచ్చిన నీరజ రెడ్డి…అదే భర్త వర్ధంతి రోజే తన అంత్యక్రియలు జరగడం నిజంగా స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. నీరజ అంత్యక్రియలకు భారీ ఎత్తున స్థానికులు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో నీరజారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. తల్లి కడసారిని చూడడానికి ఇప్పటికే ఆమె కూతురు, అల్లుడు గ్రామానిక చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..