YS Viveka Murder Case: వివేకా హత్యపై అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..! వీడియో
సీబీఐ విచారణకు ముందు ట్విస్ట్ ఇచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో తొలిసారిగా సీబీఐ నిందితుడిగా చేర్చడం..
సీబీఐ విచారణకు ముందు ట్విస్ట్ ఇచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి. విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో తొలిసారిగా సీబీఐ నిందితుడిగా చేర్చడం.. ఇవాళ ఐదోసారి విచారణకు పిలవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. పిటిషన్ పై లంచ్ మోషన్‌లో విచారణ జరపాలని అభ్యర్థించారు. హైకోర్ట్ నిర్ణయం తర్వాత సీబీఐ విచారణకు హాజరవుతానన్నారు అవినాష్. సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ అవినాష్. వివేకాకు మహిళలతో ఉన్న సంబంధాలే హత్యకు దారితీశాయన్నారు. ఏ2 సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకాకు సంబంధం ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. మరోవైపు నిందితులతో వివేకా డైమండ్స్ వ్యాపారం చేశారని కూడా పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..