Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి హెల్త్ బులెటిన్ విడుదల.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంపై.. విశ్వభారతి హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. యాంజియోగ్రామ్ చేయగా రెండు వాల్స్ బ్లాక్ అయినట్టు గుర్తించామన్నారు. చికిత్స చాలా అవసరమని.. బీపీ చాలా తక్కువగా ఉందన్నారు.
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంపై.. విశ్వభారతి హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. యాంజియోగ్రామ్ చేయగా రెండు వాల్స్ బ్లాక్ అయినట్టు గుర్తించామన్నారు. చికిత్స చాలా అవసరమని.. బీపీ చాలా తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం శ్రీలక్ష్మికి సీసీయూలోనే చికిత్స కొనసాగుతుందని హెల్త్ బులెటిన్‌లో డాక్టర్లు వివరించారు. ‘అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె నాన్‌ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ (హార్ట్ అటాక్)కు గురయ్యారు. యాంజియోగ్రామ్ చేశాక.. ఆమె డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం సీసీయూలో ఉన్న ఆమెను ఒక ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. బీపీ తక్కువగా ఉంది. ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌పై ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు వాంతులు అవుతున్నాయి. వాంతులు ఇలాగే కొనసాగితే ఆల్ట్రాసౌండ్ స్కాన్, మెదడుకు ఇమేజింగ్ స్కాన్ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఆమెకు లోబీపీ ఉన్నందున మరికొన్ని రోజులు సీసీయూలో ఉంచాల్సిన అవసరం ఉంది’ అని బులెటిన్‌లో పేర్కొన్నారు డాక్టర్లు. మరోవైపు కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ చుట్టూ పోలీస్ బలగాలు మోహరించాయి. ఓవైపు పోలీసులు, సీబీఐ అధికారులు.. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కనిపిస్తున్నారు. తన తల్లి అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లోనే ఉండిపోయారు ఎంపీ అవినాష్. దీంతో ఆయనకు సంఘీభావంగా వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. పోలీసులు మాత్రం వారికి నచ్చజెప్పి వెనక్కి పంపుతున్నారు. అవినాష్‌కు సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. పరిస్థితి చేజారకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్పిటల్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవర్నీ లోపలికి అనుమతించడం లేదు.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ఇవాళ కూడా సీబీఐ విచారణకు హజరుకావడంలేదు. ఈనెల 16, 19న కూడా అవినాష్ విచారణకు వెళ్లలేదు అవినాష్. తల్లి అనారోగ్యం కారణంగా ఇవాళ్టి విచారణకు కూడా హాజరుకాలేనని సమాచారం ఇస్తూ వస్తున్నారాయన. అయితే అనూహ్యంగా సీబీఐ అధికారులు సోమవారం రెండు వాహనాల్లో కర్నూలు వెళ్లారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో చర్చలు కూడా జరిపారు. మొత్తానికి సీబీఐ తదుపరి చర్యలు ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..