AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రాణం తీసిన ఈత సరదా.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి 9 ఏళ్ల బాలుడి మృతి

ఏపీలో స్విమ్మింగ్‌పూల్‌ లో పడి మరో బాలుడు మృతి చెందాడు. మొన్నటి విశాఖ ఘటన మరకవకముందే ఇప్పుడు చిత్తూరులో మరో బాలుడు ఈత సరదాతో కన్నుమూశాడు. చిత్తూరు జిల్లా ఎర్ర నాగులపల్లిలో స్విమింగ్‌పూల్‌లో పడి 9ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

Andhra Pradesh: ప్రాణం తీసిన ఈత సరదా.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడి 9 ఏళ్ల బాలుడి మృతి
Swimming Pool
Basha Shek
|

Updated on: May 22, 2023 | 11:13 AM

Share

ఏపీలో స్విమ్మింగ్‌పూల్‌ లో పడి మరో బాలుడు మృతి చెందాడు. మొన్నటి విశాఖ ఘటన మరకవకముందే ఇప్పుడు చిత్తూరులో మరో బాలుడు ఈత సరదాతో కన్నుమూశాడు. చిత్తూరు జిల్లా ఎర్ర నాగులపల్లిలో స్విమింగ్‌పూల్‌లో పడి 9ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రితో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లిన మనోజ్ నడుముకు కట్టిన బెండు ఊడి పోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్థానికులు ఎంత వెతికినా దొరకని మనోజ్ ఆచూకీ దొరకలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది గాలించి మనోజ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా మనోజ్‌ మృతితో పిల్లాడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఈత నేర్చుకోవడానికి బావులు, కాలువల దగ్గరకు వెళుతున్నారు. అలాగే చాలామంది స్విమ్మింగ్‌ పూల్స్‌లో సేద తీరుతున్నారు. అయితే అజాగ్రత్త, భద్రతా చర్యలు లేకపోవడంతో చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇటీవల అనకాపల్లి జిల్లాలో మూడు వారాల గ్యాప్‌లో ఇద్దరు చిన్నారులు ఇలాగే ఈత సరదాకు బలయ్యారు. మే 11 అనకాపల్లి సమీపంలోని పూడిమడక వద్ద 12 ఏళ్ల పవన్‌ కుమార్‌ అనే బాలుడు స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మునగపాక మండలం అరబ్బుపాలెంకు చెందిన గంగునాయుడు, మాధురి దంపతులు ఇద్దరి పిల్లల్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లారు. ఇద్దరు పిల్లల్ని తండ్రి పూల్ వాటర్‌లో ఆడిస్తుంటే… తల్లి ఫోటో తీయడంలో బిజీగా ఉంది. అయితే చిన్నపాటి ఏమరుపాటు కారణంగా చిన్న పిల్లాడు చరణ్‌ మునిగిపోయాడు. వాడ్ని పట్టుకుని అన్న పవన్‌కుమార్‌ కూడా మునిగిపోయాడు. తల్లితండ్రులు తేరుకుని చరణ్‌ని కాపాడగలిగారు. కానీ.. అపస్మారక స్థితిలోకి చేరిన పవన్‌ కుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..