Watch: అయ్యో ఎంత పని చేశావన్నా.. చేతికొచ్చిన పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు.. ఎందుకంటే?
కాస్త ఆదుకుంటుంది అన్న ఆశతో ఉల్లి పంట వేస్తే.. తీరా అది చేతుకొచ్చాక ధర భారీగా పతనమైపోవడం రైతన్నలను కన్నీరు పెట్టిస్తోంది. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల బాటలోనే రోజురోజుకూ ఉల్లి ధర పడిపోతుంది. గిట్టుబాటు ధరలేని పంటను మార్కెట్‌కు తీసుకెళ్లడం కూడా దండగేనని భావించిన ఒక రైతు.. ఆ పంట మొత్తాన్ని పొలంలోనే దున్నేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

రోజు రోజుకూ అమాంతం పడిపోయిన ఉల్లి రేట్లతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. కానీ మార్కెట్‌లో మాత్రం గిట్టుబాట ధర లేదు.. దీంతో ఓ రైతు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గిట్టుబాటు ధర లేని పంటను మార్కెట్లకు తీసుకెళ్లడం కూడా దండగే అనుకున్న ఆ రైతు.. చేతికొచ్చిన పంటను మొత్తం పొలంలోనే ట్రాక్టర్‌తో దున్నేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం నేరేడుప్పల గ్రామంకు చెందిన హుసేనప్ప అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఈ రైతు తనకు ఉన్న రెండు ఎకరాల పొలంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఉల్లి వేసి పంటను సాగుచేసాడు. కానీ ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి పంటను పండించిన పొలంలోనే ట్రాక్టర్ పెట్టి దున్నివేశాడు.
రెండు ఎకరాల్లో ఎకరాకు లక్ష 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉల్లిగడ్డకు మార్కేట్ లో గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కిలోకు 8 రూపాయలు మాత్రమే ఉండటంతో చాలా నష్టపోతున్నామని, కనీసం పండించిన పంటను కూలీలను పెట్టి వాటిని తీసి గ్రేడింగ్ చేసి మార్కెట్ కు వెళ్లి అమ్మితే కనీసం పెట్టబుడి డబ్బులు కూడా రావట్లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
కనీస గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని తవ్వి, మార్కెట్లకు తీసుకు రావడం కంటే పొలంలో దున్నేయడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లి పంటను సాగు చేసి లోడు తీసేసరికి దాదాపు రెండు లక్షల రూపాయల నష్టం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. మరో పక్క ఉల్లి రైతుకు ప్రభుత్వం హేక్టర్ కు 50 వేలు ఇస్తామని చెప్పిన ఇంతవరకు ఇవ్వడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
