AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: స్కూల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్ రూమ్‌లో ఏం జరిగింది..?

పులివెందులకు చెందిన జస్వంతి. కడప శివారులోని చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్ K7 లో 9వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం స్కూల్‌లో SA-1 పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామ్‌ హాల్‌లో పరీక్ష రాయాల్సిన విద్యార్ధిని.. బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అసలేం జరిగింది..? 9వ తరగతి స్టూడెంట్ మృతికి కారణమేంటి..?

Andhra: స్కూల్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్ రూమ్‌లో ఏం జరిగింది..?
Student Death
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Nov 11, 2025 | 12:28 PM

Share

విద్యార్థిని అనుమానాస్పద మృతి కడపలో ఉద్రిక్తతకు దారి తీసింది. పులివెందులకు చెందిన జస్వంతి. కడప శివారులోని చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్ K7 లో 9వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం స్కూల్‌లో SA-1 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జస్వంతి ఉదయం కళ్లు తిరిగి పడిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. ఆస్పత్రికి తీసుకువెళ్తున్నామని అక్కడకు రావాలని చెప్పారు. అయితే తాము ఆస్పత్రికి వచ్చిన తర్వాత..తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు..

జస్వంతి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. తమకు న్యాయం జరిగే వరకూ పోస్ట్‌మార్టంకు ఒప్పుకోబోమని మృతదేహంతో ఆందోళనకు దిగారు. తమ బిడ్డ చావుకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్ధిని మృతికి యాజమాన్యం కారణమని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు విద్యాశాఖ అధికారులు..

సోమవారం ఉదయం స్టడీ అవర్‌లో బాలిక తన హాస్టల్‌ రూమ్‌కు వెళ్లి గడియ పెట్టుకుందని.. చాలా సేపు తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థిని చూడగా.. అప్పటికే రూములో ఫ్యాన్‌కు ఊరేసుకుని వేలాడుతూ కనిపించిందని యాజమాన్యం తెలిపింది.

మరోవైపు విద్యార్థిని మృతిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు కడప జిల్లా చింతకొమ్మదిన్నె పోలీసులు. బాధితులను కఠినంగా శిక్షిస్తామన్న పోలీసుల హామీతో ఎట్టకేలకు పోస్ట్‌మార్టంకు ఒప్పుకున్నారు జస్వంతి కుటుంబ సభ్యులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us