Kothapally Waterfalls: దట్టమైన పొగమంచు, జాలువారే జలపాతాలు.. విశాఖ ఏజెన్సీలో కనువిందు చేస్తోన్న ప్రకృతి దృశ్యాలు
Kothapalli Waterfalls: చలికాలం వచ్చిందంటే ప్రకృతి ప్రేమికులకు కన్నుల పండుగ. మరే కాలంలోనూ కనిపించని ప్రకృతి అందాలు శీతాకాలంలోనే కనువిందు చేస్తుంటాయి. ఓ వైపు ఎముకలు కొరికే చలి.. మధ్యలో తనువును తాకే లేలేత సూర్య కిరణాలు...జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను మిగిల్చిపోతాయి. విశాఖ ఏజెన్సీలో ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రకృతి సోయగాలతో అలరారుతోంది. రోజూ దట్టమైన పొగమంచు అలుముకుంటోంది.ఎత్తయిన కొండల్లో నుండి చూస్తే మేఘాల్లో తేలి ఆడుతున్నట్లు ఉంటుంది.

Kothapalli Waterfalls: చలికాలం వచ్చిందంటే ప్రకృతి ప్రేమికులకు కన్నుల పండుగ. మరే కాలంలోనూ కనిపించని ప్రకృతి అందాలు శీతాకాలంలోనే కనువిందు చేస్తుంటాయి. ఓ వైపు ఎముకలు కొరికే చలి.. మధ్యలో తనువును తాకే లేలేత సూర్య కిరణాలు…జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను మిగిల్చిపోతాయి. విశాఖ ఏజెన్సీలో ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రకృతి సోయగాలతో అలరారుతోంది. రోజూ దట్టమైన పొగమంచు అలుముకుంటోంది.ఎత్తయిన కొండల్లో నుండి చూస్తే మేఘాల్లో తేలి ఆడుతున్నట్లు ఉంటుంది. లంబసింగి విశాఖ మన్యంలో మరో అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ నవంబర్ డిసెంబర్ నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. దీనిని ఆంధ్రా కశ్మీర్ అని కూడా అంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ కొండపై నుంచి చలికాలంలో సూర్యోదయాన్ని చూడటం ఒక గొప్ప అనుభూతి నిస్తుంది. పచ్చని కొండల మధ్యలో ఉండే చల్లని లోయ ఇది. పద్మావతీ గార్డెన్స్, దగ్గరలోని చాపరాయి, బొర్రా గుహలు వంటి ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలతో పాటు గిరిజన మ్యూజియం సందర్శకులను మైమరిచిపోయేలా చేస్తాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.
చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పాడేరు, అరకులో ఉదయం 15 డిగ్రీలు, చింతపల్లిలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు వంజంగి, అరకు మాడగడ మేఘాల కొండల మద్య సుందర దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ప్రతియేటా ఇక్కడకు పెద్ద ఎత్తున యాత్రీకులు వస్తుంటారు. ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ మధురాను భూతిని పొందుతుంటారు. వీకెండ్ కావడంతో పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రద్దీ పెరిగింది. జి మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం పరవళ్ళు తొక్కుతోంది. దీంతో సందర్శకులు భారీగా తరలివస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
