AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodali Nani: గుడివాడ వచ్చిన కొడాలి నాని – ఛాతికి ఆ బెల్డ్ ఎందుకు ధరించారో తెల్సా..?

టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు చెందిన దుకాణంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊరట లభించింది. ఆయనకు గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఛాతీకి బెల్టుతో కోర్టుకు వచ్చిన నాని.. బెయిల్ పత్రాలు సమర్పించారు. చ

Kodali Nani: గుడివాడ వచ్చిన కొడాలి నాని - ఛాతికి ఆ బెల్డ్ ఎందుకు ధరించారో తెల్సా..?
Kodali Nani
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2025 | 12:39 PM

Share

కొడాలి నానికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది గుడివాడ కోర్టు. మాజీ MLA రావి వస్త్ర దుకాణంపై దాడి కేసులో షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది కోర్టు. మంగళవారం, శనివారం గుడివాడ పీఎస్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. దిగువ కోర్టులో బెయిల్‌ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని. బెయిల్ లభించిన అనంతరం.. హామీ పత్రాలు సమర్పించారు. ఈ కేసులో 16 మంది నాని అనుచరులు ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే కొడాలి నాని చెబితేనే దాడి చేశామని వీరంతా పోలీస్‌ కస్టడీలో అంగీకరించినట్ట తెలుస్తోంది. దీంతో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో గుడివాడలో కనిపించకుండాపోయారు కొడాలి నాని. ఏడాది తర్వాత గుడివాడలో నాని కనిపించడంతో వైసీపీ శ్రేణులు కోర్టు దగ్గరకు భారీగా తరలివచ్చారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొడాలి నానికి హైదరాబాద్‌, ముంబైలోని హాస్పిటల్స్‌లో చికిత్స జరిగింది.

కొడాలి నాని ఆ బెల్డ్ ధరించింది ఎందుకంటే..?

గుడివాడ వచ్చిన కొడాలి నాని ఛాతీకి బెల్టు పెట్టుకుని కనిపించారు. ఆయనకు ఇటీవల గుండె ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డాక్టర్ల సూచన మేరకు ఆ బెల్టును ధరించారు. ఆ బెల్టులో ఒక మెషిన్ ఉంటుందని.. అది నిరంతరం గుండెకు సంబంధించి అన్ని విషయాలను మోనిటరింగ్ చేస్తుందని చెబుతున్నారు. గుండెకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా.. వెంటనే అలెర్ట్ చేస్తుందట.  కొన్ని నెలల తర్వాత కొడాలి నాని గుడివాడ రావడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆయన్ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ..!
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
సూరీడు గుర్తున్నాడా..? ఆయన గురించి చాలామందికి తెలియని నిజం..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. కానీ మిస్ అయ్యింది
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
ఇది కదా అసలైన పండుగంటే.. ఆ ఊరిలో గోమాత అలంకరణ పోటీలు!
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
మీరు మౌని అమావాస్య నాడు ఉపవాసం ఉంటున్నారా..? ఈ విషయాలు..
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ .. క్లిక్ చేస్తే ఖేల్ ఖతం!
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
బౌలరును వెక్కిరించబోయి వికెట్ పారేసుకున్న పాక్ క్రికెటర్
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
‘మన శంకర వరప్రసాద్’కి నెగెటివ్ రివ్యూ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ