AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: పొలం దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..

ప్రజంట్ వర్షాకాలం నడుస్తోంది. అల్పపీడనంతో పాటు రుతుపవనాల ప్రభావంతో.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రైతులు విత్తనాలు వేసేందుకు పొలాలు సిద్దం చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలో రైతు పొలం దున్నుతుండగా అరుదైన పురాతన విగ్రహం బయటపడింది .

Kadapa: పొలం దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
Ploughing Land (Representative image )
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2025 | 12:14 PM

Share

వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని రేకలకుంట గ్రామంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక రైతు కూనపులి రాజశేఖర్ నాయుడు తన పొలాన్ని దుక్కి దున్నుతుండగా పురాతన విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం చూసిన రాజశేఖర్ ఆశ్చర్యానికి గురయ్యారు. చరిత్రకారుడు, రచయిత బొమ్మిశెట్టి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విగ్రహం 18వ శతాబ్దానికి చెందినదిగా తెలిపారు. ఇది ఒక మహిళ విగ్రహమని, ఎడమ వైపున కొప్పు ఉంటే.. కుడి చేతిలో పుష్పం పట్టుకుని ఎంతో అందంగా ఉందని వివరించారు.

విగ్రహంలో కాళ్లు, చేతులకు కడియాలు ధరించినట్టు కనిపిస్తుందని.. నాటి శిల్పకారుల నైపుణ్యాన్ని ఈ విగ్రహం ప్రతిబింబిస్తున్నదని రమేష్ తెలిపారు. విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నందున.. ఇది ఆ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు. ఈ విగ్రహం ఆ కాలం శిల్పకళా నైపుణ్యానికి కూడా ఓ ఉదాహారణ అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు రాజశేఖర్ పొలంలో బయటపడిన ఈ విగ్రహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Ancient Artifact

Ancient Artifact

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..