Andhra Pradesh: నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు.. కొడాలి నాని ఆసక్తికర వివరాలు వెల్లడి..
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు పర్యటనపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నిమ్మకూరుకు చేసిందేమీ లేదన్నారు.
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు పర్యటనపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నిమ్మకూరుకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు నిమ్మకూరుపై చంద్రబాబు దొంగ ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిమ్మకూరుకు వెళ్లిన చంద్రబాబు.. అక్కడ ఎవరూ ఇళ్లు కూడా ఇవ్వలేదని, అందుకే ఆయన బస్సులోనే బసచేశారని ఎద్దేవా చేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను తాను, జూనియర్ ఎన్టీఆర్ రూ.60 లక్షలు పెట్టి 2003లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తామిద్దరూ అక్కడ భూమిని కొనుగోలు చేసి విగ్రహాలు పెట్టించినట్లు చెప్పారు. నాడు నిమ్మకూరులో ఎకరా భూమి రూ.3 లక్షలే ఉందన్నారు. నిమ్మకూరుపై ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ప్రేమ ఉందన్నారు. నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవని తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పే మాటలను గుడివాడ నియెజకవర్గ ప్రజలు నమ్మబోరని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి