Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గలేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
Privatization of Visakhapatnam Steel Factory: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుతవం. ఆర్ఐఎన్ఎల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియపై ఎలాంటి స్తంభన లేదని తేల్చి చెప్పింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ప్రక్రియపై కొన్ని మీడియా నివేదికల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర మరోసారి స్పష్టత ఇచ్చింది. డిజిన్విస్టిమెంట్ ప్రక్రియలో నిలిచిపోలేదని స్పష్టం చేసింది. గడిచిన రెండు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఉక్కు శాఖ ప్రకటన జారీ చేసింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల మీడియా నివేదికల్లో నిజం లేదని.. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని ప్రకటించింది ఉక్కుశాఖ. ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపరచడానికి మాత్రమే మద్దతు ఇస్తున్నామని.. త్వరలో ప్రైవేటీకరణ పూర్తి అవుతుందని తెలిపింది.
నిన్న కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖ వచ్చి తాత్కాలికంగా పెట్టుబడులు ఉపసంహరణ ఆగినట్టు ప్రకటించారు. దీనిపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, వైసీపీ ఎవరిరి వారు తమ ఘనతగా చాటుకుంటూ ప్రకటనల చేశారు. మాటలయుద్ధానికి కూడా దిగారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్- బీజేపీ మధ్య వార్ నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..