Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లోకి టీమిండియా క్రికెటర్‌ ఎంట్రీ.? బీఆర్‌ఎస్‌ తరపున బరిలోకి.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా.? బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున బరిలోకి దిగనున్నాడా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రముఖ క్రికెటర్ రాజకీయాలపై చూస్తున్నాడా..? వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పొలిటికల్ అరంగ్రేటం చేయనున్నాడా ఇప్పుడు ఏపీ పొలిటికల్‌...

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లోకి టీమిండియా క్రికెటర్‌ ఎంట్రీ.? బీఆర్‌ఎస్‌ తరపున బరిలోకి.?
Andhra Pradesh
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 14, 2023 | 3:01 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా.? బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున బరిలోకి దిగనున్నాడా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రముఖ క్రికెటర్ రాజకీయాలపై చూస్తున్నాడా..? వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పొలిటికల్ అరంగ్రేటం చేయనున్నాడా ఇప్పుడు ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ రాజకీయ ప్రస్తావన ప్రస్తుతం జిల్లాలో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆ యువ క్రికెటర్ ఎవరు. ఆయన చేరబోతున్న పార్టీ ఏది అన్న ప్రశ్న లు జిల్లాలో చక్కెర్లు కొడుతున్నాయి.

అంబటి రాయుడు. దూకుడైన క్రికెట్ కు మారు పేరు. ఆడిన మ్యాచ్ లు తక్కువైనా టాలెంట్ తక్కువేమీ లేదని అతని గురించి చెప్పుకుంటుంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు ప్రస్తుతం ఐపిఎల్ లో చెన్నై జట్టులో ఉన్నాడు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆలోచనలో అంబటి ఉన్నాడంట. అంబటి సొంతూరు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి కుటుంబానికి గ్రామంలో మంచి పేరే ఉంది. రాయుడు వాళ్ళ తాత గ్రామ సర్పంచ్ గా పని చేశారు. వాళ్ళ పెద నాన్న అంబటి లక్ష్మణరావు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేసి రిటైర్డ్ అయ్యారు. కాపు సామాజిక వర్గం కావటం, ఆర్థికంగా మెరుగ్గా ఉండటం ఆయనే రాజకీయాల పట్ల మొగ్గు చూపడంతో ఆయన చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో బిఆర్ఎస్ ముందున్నట్లు వినపడుతుంది. బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రాయుడు తో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.

బిఆర్ఎస్ లో చేర్చుకొని గుంటూరు వెస్ట్ లాంటి నియోజకవర్గం నుండి బరిలోకి దించాలన్న ముందస్తు ఆలోచనతో తోట ఉన్నారట. అయితే అంబటి కుటుంబ మొదటి నుండి టిడిపి గ్రామ స్థాయిలో అనుకూలంగా ఉంటారనే పేరుంది. అటు వైపు నుండి టిడిపి కూడా టచ్ లోకి వెళ్లినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఇక యూత్ మాత్రం ఆయన జనసేనలో చేరతారని అంటున్నారట. కాపు సామాజిక వర్గం కావటం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉండటంతో స్థానికంగా ఉండే నాయకులు జేఎస్పిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట.

దీంతో అంబటి ఎటు వైపు వెళ్తారని ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. రాయుడు రాజకీయాల చుట్టూ తిరగాలనుకోవడంతోనే రాజకీయ పార్టీలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా కొంతమంది మాత్రం ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని అంటున్నారు. ఆయన వస్తానని చెప్పుకుముందే పొలిటికల్ పార్టీలు తమ పార్టీలోకి వస్తున్నాడని కోడై కూస్తున్నాయట. ఎంతైనా క్రేజ్ ఉన్న క్రికెటర్ కదా… ఆయన కూడా దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకుంటాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..