Kodali Nani: ఆ విషయంలో సంబంధం లేదని ప్రమాణం చేస్తారా.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్..

ఢిల్లీ లిక్కర్ స్మామ్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇప్పటికే అధికారులు తెలంగాణలో సోదాలు, తనిఖీలు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ స్కామ్ లో ఫలానా...

Kodali Nani: ఆ విషయంలో సంబంధం లేదని ప్రమాణం చేస్తారా.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్..
Kodali Nani Chandrababu Naiidu
Follow us

|

Updated on: Nov 10, 2022 | 8:35 PM

ఢిల్లీ లిక్కర్ స్మామ్ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇప్పటికే అధికారులు తెలంగాణలో సోదాలు, తనిఖీలు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ స్కామ్ లో ఫలానా వారు ఉన్నారంటూ చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి ఈ స్కామ్ లో ప్రమేయం ఉందన్న వార్తలు గుప్పుముంటున్నాయి. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రెస్పాండ్ అయ్యారు. లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన వారిలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని తేల్చి చెప్పారు. అరబిందో సంస్థతో సంబంధం లేదని ప్రమాణం చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. 2004-19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్‌ వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు జీవిత కాలం సమయం ఇస్తున్నాన్న కొడాలి నాని… పులివెందులలో ఒక్క పంచాయతీ అయినా గెలవగలరా అని మండిపడ్డారు. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని కొడాలి నాని జోస్యం చెప్పారు. జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు అంకితం చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. శరత్‌ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్‌బాబును అరెస్టు చేసినట్లు తెలిపాయి. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్‌ 21, 22, 23 తేదీల్లో దిల్లీలో శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఆయనను విచారించి, ఇవాళ (గురువారం) ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. ఈ కేసులోనే గతంలో బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..