Pawan Kalyan: పడిలేచిన కెరటం పవన్.. కూటమి ప్రభంజనంలో కీలక పాత్ర..

2019లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయాన్ని పొందాడు. తాను పోటీ చేసిన విశాఖ, భీమవరం నుంచి మాత్రమే కాదు.. ఒక్క రాజోలు నియోజక వర్గం ఎమ్మెల్యే రాపాక మినహా మిగిలిన జనసేన అభ్యర్ధులు కూడా ఓటమి పాలయ్యారు. అప్పుడు సర్వత్రా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఎంతగా అంటే.. ప్రజారాజ్యం బాటలో జనసేన కూడా క్లోజ్ అనే దిశగా సాగేవి విమర్శలు.. ఎవరు ఏమన్నా.. ఎంతగా విమర్శించినా .. వ్యక్తిగత జీవితం మీద మాత్రమే కాదు.. తన ఫ్యామిలీని పోలిటిక్స్ లో లాగి దారుణంగా మాట్లాడినా పవన్ సహనంతో ఉన్నాడు. మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలనే దిశగా అడుగులు వేశాడు..

Pawan Kalyan: పడిలేచిన కెరటం పవన్.. కూటమి ప్రభంజనంలో కీలక పాత్ర..
Pawan Kalyan
Follow us

|

Updated on: Jun 04, 2024 | 2:03 PM

మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. అందరి హీరోలకు అభిమానులుంటారు.. పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు.. అంటే పవన్ కళ్యాణ్ ను తమ దైవంగా భావించి కొలుస్తారు అభిమానులు. అన్న మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువనేతగా రాజకీయంలో అడుగు పెట్టాడు. రాజకీయంగా అన్నతో విబేధించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా జనసేన పార్టీని స్థాపించాడు. అయితే 2014 లో నవ్యాంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి బేషరత్తుగా తన మద్దతు ప్రకటించాడు. ప్రభుత్వం పని తీరు నచ్చక పొతే నేను ప్రశ్నిస్తా అని అన్న జనసేనాని.. అప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా తనకు అన్యాయం అన్న విషయంపై, ప్రభుత్వంలో జరిగే అవకతవకలపై తన గళం వినిపిస్తూనే ఉన్నాడు.

2019లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయాన్ని పొందాడు. తాను పోటీ చేసిన విశాఖ, భీమవరం నుంచి మాత్రమే కాదు.. ఒక్క రాజోలు నియోజక వర్గం ఎమ్మెల్యే రాపాక మినహా మిగిలిన జనసేన అభ్యర్ధులు కూడా ఓటమి పాలయ్యారు. అప్పుడు సర్వత్రా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఎంతగా అంటే.. ప్రజారాజ్యం బాటలో జనసేన కూడా క్లోజ్ అనే దిశగా సాగేవి విమర్శలు.. ఎవరు ఏమన్నా.. ఎంతగా విమర్శించినా .. వ్యక్తిగత జీవితం మీద మాత్రమే కాదు.. తన ఫ్యామిలీని పోలిటిక్స్ లో లాగి దారుణంగా మాట్లాడినా పవన్ సహనంతో ఉన్నాడు. మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలనే దిశగా అడుగులు వేశాడు..

వైసిపీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై సునిసిత విమర్శలు చేస్తూ.. ప్రజలు కష్టాల్లో తానున్నాను అంటూ భరోసాగా నిలిచాడు. అన్నదాతలకు మాత్రమే కాదు చేనేత కార్మికులకు.. ఇలా బాధితులకు అండగా నిలిచాడు. తన సొంత డబ్బులకు బాధిత కుటుంబాలకు ఇచ్చి అండగా నిలిచాడు. అంతేకాదు.. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా వైసిపీకి చెక్ పెట్టె విధంగా రాజకీయ చతురతను చాటుకున్నాడు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పరామర్శకు వెళ్ళిన పవన్ హటాత్తుగా మీడియా ముందుకు వచ్చి ఎన్నికల్లో టిడిపీ, జనసేన కలిసి పోటీ చేస్తుంది అని ప్రకటించాడు. అంతేకాదు.. ఏపీ ప్రజల ప్రయోజనం కోసం తనని తానూ తగ్గించుకుని మరీ తక్కువ సీట్లతోనే పోటీకి వెళ్ళడమే కాదు.. బీజేపీని కూడా కూటమితో కలిసి నడిచేలా చేయడంలో పవన్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ను ఓడించడం కోసం అధికార వైసిపీ ప్రభుత్వం రాజకీయ ఉద్దండులను రంగంలోకి దింపింది. స్వయంగా సిఎం జగన్ .. వైసిపీ అభ్యర్ధి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ  సిఎం పదవిని ఇస్తానని ప్రకటించారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. పవన్ మీద అభిమానంతో మెగా హీరోలు మాత్రమే కాదు అనేక మంది మేము సైతం అంటూ మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పదేళ్ళ పవన్ శ్రమకు తగిన ఫలితం ఈ రోజు దక్కింది.. కూటమిలో భాగంగా జనసేనకు దక్కిన 21 సీట్లలో 19 మంది గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. తనపై చేసిన విమర్శలకు ఓపికతో ఈ రోజు తన గెలుపుతో పాటు తన పార్టీ అభ్యర్ధుల గెలుపుతో చెప్పకనే చెప్పేశారు పవన్.. అందుకే పెద్దలు అంటారు.. ఓడినప్పుడు కుంగిపోవద్దు.. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని జీవితంలో అన్వయించుకుని ముందుకు సాగితే గెలుపు మీ ముంగిట వాలుతుంది అని .. అందుకు సజీవ సాక్ష్యం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..