AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaganyaan: గగన్ యాన్ ప్రయోగ పరీక్షలో కీలక ఘట్టం.. శ్రీహరి కోట నుంచి టెస్ట్ లాంచ్..

ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాల కోసం మనం ఇతర దేశాల వైపు ఆసక్తి అనడంకంటే ఆశగా చూసే పరిస్థితి.. మన అవసరాల కోసం కూడా మనం ప్రయోగాలు చేసుకునే అవకాశం లేని రోజుల నుంచి ప్రపంచ దేశాలకు కూడా భారత్ ఓ ఆశా కిరణం. ఇతర దేశాలకు చెందిన వందలాది ఉపగ్రహాలను భారత్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి సత్తా చాటింది. ఇక ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని ప్రయోగాలను సైతం చేపట్టి రికార్డు సృష్టించింది ఇస్రో.

Gaganyaan: గగన్ యాన్ ప్రయోగ పరీక్షలో కీలక ఘట్టం.. శ్రీహరి కోట నుంచి టెస్ట్ లాంచ్..
Key Moment In Gaganyaan Mission, Test From Srihari Kota Andhra Pradesh
Ch Murali
| Edited By: |

Updated on: Oct 08, 2023 | 7:28 AM

Share

ISRO: ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాల కోసం మనం ఇతర దేశాల వైపు ఆసక్తి అనడంకంటే ఆశగా చూసే పరిస్థితి.. మన అవసరాల కోసం కూడా మనం ప్రయోగాలు చేసుకునే అవకాశం లేని రోజుల నుంచి ప్రపంచ దేశాలకు కూడా భారత్ ఓ ఆశా కిరణం. ఇతర దేశాలకు చెందిన వందలాది ఉపగ్రహాలను భారత్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి సత్తా చాటింది. ఇక ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని ప్రయోగాలను సైతం చేపట్టి రికార్డు సృష్టించింది ఇస్రో. వరుస విజయాలతో ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న ఇస్రో మరో భారీ ప్రాజెక్టును వేగవంతం చేసింది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయన్.. నెక్ట్స్ గగన్ యాన్.. భారత్ చేస్తున్న తొలిమ్యాన్ మిషన్ పనులు వేగవంతం అయ్యాయి. ప్రయోగానికి ముందు ఎన్నో ప్రయోగాత్మక ప్రయోగాలు చేపట్టాల్సి ఉంది. భారత్ చేపడుతున్న మ్యాన్ మిషన్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్ యాన్ వన్ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయాన్ అంతకు మించిన ఎఫర్ట్ తో ఇస్రో చేస్తున్న ప్రయోగం గగన్ యాన్. భారత్ చేస్తున్న తొలి మ్యాన్ మిషన్ కావడంతో ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసలు ప్రయోగానికి ముందుగా జరిగే ప్రయోగాత్మక ప్రయోగాలను ఒకటికి రెండు సార్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖపట్నం, గుజరాత్, తమిళనాడులో కీలకమైన ప్రయోగాలను గగన్ యాన్ కోసం ముందస్తు పరీక్షలను చేపట్టారు. బెంగళూరు నుండి గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూ మాడ్యూల్ ను శ్రీహరికోట కు తరలించారు. అయితే ఏడాదిలో రోదశిలోకి వ్యోమగాములను పంపి తిరిగి సురక్షితంగా భూమి పైకి తెచ్చే గగన్ యాన్ ..1 మ్యాన్ మిషన్ ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తుంది. అందులో భాగంగానే అక్టోబర్ మూడవ వారంలో గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టం గా పిలవబడే ఒక ప్రయోగాత్మక ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇస్రో ఈ గగన్ యాన్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు రకాల పరీక్షలు విజయవంతం గా నిర్వహించి తమ సామర్థ్యాన్ని నిరూపించారు.ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు గగన్ యాన్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ప్రయోగాత్మక ప్రయోగంగా జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. LVM..3 ద్వారా ఇటీవల భారీ బరువున్న ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది ఇస్రో. అయితే LVM3 ని మరింత అప్డేట్ తో H.LVM 3 అంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మాడ్యూల్ అన్నమాట. ఈ రాకెట్ ద్వారా 8200 కేజీలు బరువు కలిగిన CREW మాడ్యూల్ 3.25 వెడల్పుగా, 3.58 పొడవైన క్రూ మాడ్యూల్ ను ఇందులో అమర్చి గగన్ యాన్..1 పేరుతో షార్ లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి మరో వారంలో టెస్ట్ లాంచ్ చేపట్టనుంది.

ఈ క్రూ మాడ్యూల్ ను లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టి అక్కడ ఏడు రోజులు తరువాత తిరిగి భూమి మీద కు సురక్షితంగా దింపేలా ప్లాన్ చేశారు. అయితే ఇలా రెండు పర్యాయాలు గగన్ యాన్ ట్రైల్ లాంచ్ ప్రయోగాలు ప్రయోగాత్మకంగా చేపట్టిన తర్వాత గగన్ యాన్ రాకెట్ ప్రయోగంలో మానవ సహిత మాన్ మిషన్ ప్రయోగం చేపట్టనుంది. వ్యోమగాములు ను రోదసీ నుండి తిరిగి భూమి మీదకు సురక్షితంగా తీసుకురావడమే ఇస్రో ప్రధాన లక్ష్యం. ప్రత్యేకంగా రూపొందించిన టెస్ట్ వెహికల్ ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి క్రూ ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుళ్లను శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని హార్డ్‌వేర్‌ వ్వస్థలు ఇప్పటికే శ్రీహరి కోటకు చేరుకున్నాయి. ప్రస్తుతం అనుసంధాన పనులు షార్ లో జరుగుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. మిషన్ విఫలమయ్యే పరిస్థితి తలెత్తినప్పుడు మాడ్యుల్ నుంచి వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతికతను ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. ఇందులో హ్యూమనాయిడ్ వ్యోమమిత్ర అనే రోబో ను ఉంచి పరీక్షించనున్నారు. గగన్‌యాన్ మిషన్ లో అత్యంత కీలకంగా భావించే ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరును మెరుగు పరిచేందుకు ఇటీవల చేపట్టిన పరీక్ష సక్సెస్ అయింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో ఈ పరీక్షలు విజయవంతం గా నిర్వహించగా.. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (SMPS) పనితీరును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. అలాగే విశాఖ, గుజరాత్ లో కూడా కొన్ని పరీక్షలను సక్సెస్ చేసింది ఇస్రో. ఇస్రో చేపడుతున్న ఈ మ్యాన్ మిషన్ శ్రీహరికోట నుంచే జరుగుతుండగా ప్రపంచ వ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ & టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..