AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: పొలిటికల్ బ్లాస్టింగ్ న్యూస్.. ఏపీలో 2014 సీన్ రిపీట్ !

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీలో సీట్లు మార్పులతో హడావిడి జరుగుతుంది. అటు టీడీపీ-జనసేన పార్టీలు సీట్లు సర్దుబాటుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో పొలిటికల్ బ్రేకింగ్ అందింది. కూటమిలోకి బీజేపీ కూడా జాయిన్ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.

AP Politics: పొలిటికల్ బ్లాస్టింగ్ న్యూస్.. ఏపీలో 2014 సీన్ రిపీట్ !
TDP- Janasena- BJP
Ram Naramaneni
|

Updated on: Dec 29, 2023 | 2:34 PM

Share

ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ ఇది. పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014 సీనే రిపీట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులపై సంక్రాంతికల్లా బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది హైకమాండ్. టీడీపీతో పొత్తుపై BJPలో అభిప్రాయ సేకరణ పూర్తైనట్లు తెలిసింది. టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీ మెజార్టీ నేతల సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పొత్తు వల్ల 3 పార్టీలకు జరిగే లాభనష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట. ఈ రిపోర్ట్‌ను మోదీ ఆఫీసుకు కూడా అందజేశారట. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది.

టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేయాలి. జనసేనకు ఎన్ని సీట్లు.. BJPకి కేటాయించే స్థానాలేవి.. ప్రస్తుతం వీటిపైనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జనవరి మొదటివారంలో పవన్ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. YCP లిస్టు ఇవాళ, రేపట్లో ఫైనల్ అయిపోతున్న నేపథ్యంలో కూటమి నుంచి కూడా స్పీడ్‌ పెంచాలని భావిస్తున్నారు. అందుకే సంక్రాంతి డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు. 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ సీట్లు బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం అందింది. తమకు బలమున్న స్థానాలు ఇవ్వాలని బీజేపీ షరతు పెట్టిందట. ఇప్పటికే టీడీపీ-జనసేన పోటీ చేసే సీట్లపై స్పష్టత చాలా వరకు స్పష్టత వచ్చింది. బీజేపీ ఎంట్రీతో కసరత్తుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది.

పొత్తులు, సీట్ల విషయంలో సంక్రాంతికల్లా ప్రకటన వస్తుందని ఇవాళ లోకేష్‌ అన్నారు. టీడీపీ- జనసేన సీట్లపై తమకు స్పష్టత ఉందని అంటున్నారు. జనసేనతో పొత్తు ఉంది అని మరోసారి పునరుద్ఘాటిస్తూనే.. అంతకుమించిన నిర్ణయాలన్నీ హైకమాండ్‌ తీసుకుటుందని పురంధేశ్వరి చెప్తున్నారు. ఇటీవల ఢిల్లీ టూర్‌లో పొత్తులపై తమ అభిప్రాయాలను పార్టీ నేతలంతా అధిష్టానం మందు ఉంచారు. మెజార్టీ నేతలు పొత్తులకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే నివేదిక సిద్ధం చేసి ప్రధానికి పంపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..