Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jonnalagadda Padmavathi: వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఇన్‌చార్జ్‌ల థర్డ్‌ లిస్ట్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. తనకు టికెట్‌ వస్తుందో రాదో సీఎం జగనే చెప్పాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్‌బుక్‌ లైవ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్‌ చెప్పిన ప్రతి ప్రోగ్రామ్‌ చేసుకుంటూ వెళ్లానని వివరించారు.

Jonnalagadda Padmavathi: వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు
Mla Jonnalagadda Padmavathy
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 08, 2024 | 11:45 AM

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఇన్‌చార్జ్‌ల థర్డ్‌ లిస్ట్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. తనకు టికెట్‌ వస్తుందో రాదో సీఎం జగనే చెప్పాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్‌బుక్‌ లైవ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బయట పబ్లిక్‌ టాక్‌ గురించి తానేమీ చెప్పలేదనన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే పద్మావతి అంటున్నారు. హైకమాండ్‌ చెప్పిన ప్రతి ప్రోగ్రామ్‌ చేసుకుంటూ వెళ్లానని వివరించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాలని చెబితే, అలా చేస్తే ఇమేజ్‌ పెరుగుతుందని జగన్‌ చెప్పారని, అందుకు అనుగుణంగానే నడుచుకున్నామన్నారు. ఇక బస్సుయాత్రల గురించి కూడా జొన్నలగడ్డ పద్మావతి ఫేస్‌బుక్‌ లైవ్‌లో వ్యాఖ్యానించారు. టికెట్‌ ఖరారు అయినవాళ్లకే బస్‌ యాత్రలో పాల్గొనేలా చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు.

ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ. తమ వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని, ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఏనాడు నీటి సమస్యను పరిష్కరించలేదు. 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలి. ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా? అంటూ ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా సింగనమల ప్రజలు గెలిపించారని, కానీ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏమాత్రం సహకరించలేదని సంచలన ఆరోపణలు చేశారు. నా పట్ల, నా భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని సీఎంను అభ్యర్థించాం. కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాను అంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇంటర్ ఫెయిలైన వారికి అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
ఇలా చేస్తే రాలిన చోట జుట్టు తిరిగొస్తుంది..
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
'యానిమల్' విలన్‌ లవ్ స్టోరీనే రిపీట్ చేసిన టీమిండియా ప్లేయర్
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
ఈ వీకెండ్ లో వన్‌ డే టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? హైదరాబాద్‌కు
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
త్వరలో శనిశ్వరుడి నక్షత్రం మార్పు.. వీరు బంగారం పట్టుకున్నా మసే..
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఇంటర్‌ ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
ఈ పండ్లు తింటే మీ చర్మం ఎప్పటికీ యవ్వనంగానే ఉంటుంది..!
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
కొత్త ఇల్లు నిర్మాణం.. పునాదిలో ఈ వస్తువులను ఉంచడం శుభప్రదం..
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
లైవ్ మ్యాచ్‌లో అవమానం.. ఒక్క మాటతో గోయెంకాకు ఇచ్చిపడేశాడుగా
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?
మధుమేహం ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చా.. తాగకూడదా..?