Araku Coffee: అరకు కాఫీకి అంతర్జాతీయ అవార్డు.! కేంద్ర మంత్రుల చేతులమీదుగా అవార్డు..
అరకు కాఫీ పేరు చెప్పగానే ఆహా అనాల్సిందే..! ఎందుకంటే దాని ఫ్లేవర్ అలాంటిది మరి. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో పండుతున్న ఆ కాఫీని ఒకసారైనా టేస్ట్ చేయాలనుకుంటారు కాఫీ ప్రియులు. అరకులో పుట్టి దేశవ్యాప్తంగా విస్తరించి విదేశాల్లో సైతం మనసు గెలుచుకుంటున్న అరకు కాఫీ..ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది. అరకు గిరిజన సహకార సంస్థకు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది. నాణ్యతలో అరకు కాఫీకి దక్కిన అవార్డును సంస్థ వైస్ చైర్మన్ సురేశ్ కుమార్‌కి...
అరకు కాఫీ పేరు చెప్పగానే ఆహా అనాల్సిందే..! ఎందుకంటే దాని ఫ్లేవర్ అలాంటిది మరి. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో పండుతున్న ఆ కాఫీని ఒకసారైనా టేస్ట్ చేయాలనుకుంటారు కాఫీ ప్రియులు. అరకులో పుట్టి దేశవ్యాప్తంగా విస్తరించి విదేశాల్లో సైతం మనసు గెలుచుకుంటున్న అరకు కాఫీ..ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది. అరకు గిరిజన సహకార సంస్థకు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది. నాణ్యతలో అరకు కాఫీకి దక్కిన అవార్డును సంస్థ వైస్ చైర్మన్ సురేశ్ కుమార్‌కి ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వేడుకలో కేంద్ర మంత్రులు జయశంకర్, పీయూష్ గోయల్ అవార్డును అందజేశారు. జాతీయ స్థాయిలో అరకు కాఫీకి విశిష్ట గుర్తింపు తెచ్చిపెట్టిన అధికారులను అభినందించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ తీసుకురావడంలో సహకరిస్తున్న గిరిజన రైతులు, సంస్థ సిబ్బంది సహకారం మరవలేమన్నారు ఆ సంస్థ వైఎస్ చైర్మన్ సురేశ్ కుమార్. దేశంలో వివిధ జిల్లాల్లో ప్రాచుర్యం పొందిన ఉత్పత్తులకు ‘వన్ డిస్ట్రిక్ట్…వన్ ప్రొడక్ట్’ పేరిట ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కేంద్రం చేపట్టిన వన్ డిస్ట్రిక్.. వన్ ప్రొడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ చేనేతకు ఐదు అవార్డులు దక్కాయి..కాకినాడ జిల్లా ఉప్పాడ జంధాని చీరలు, అల్లూరి జిల్లా అరకుకాఫీకి బంగారు పతకాలు దక్కగా.. శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ చీరలు, కర్నూలు జిల్లా కొడుమూరు గద్వాల చీరలకు కాంస్యం దక్కింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.