Lawyer Apologized: గొంతు తగ్గించండి.! మమ్మల్నే బెదిరిస్తారా.? కోర్టులో న్యాయవాది తీరుపై సీజేఐ అసహనం
సుప్రీంకోర్టులో బుధవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. తనను అసహనానికి గురి చేసిన న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించాలని హెచ్చరించారు. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడటంతో సీజేఐ అసహనానికి గురయ్యారు. న్యాయవాదితో.. సాధారణంగా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు.. గొంతును పెంచడంద్వారా కోర్టును బెదిరించలేరు.. నా 23 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
సుప్రీంకోర్టులో బుధవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. తనను అసహనానికి గురి చేసిన న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించాలని హెచ్చరించారు. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడటంతో సీజేఐ అసహనానికి గురయ్యారు. న్యాయవాదితో.. సాధారణంగా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు.. గొంతును పెంచడంద్వారా కోర్టును బెదిరించలేరు.. నా 23 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నా పదవి ఆఖరి సంవత్సంలోనూ ఇలాంటి పరిస్థితి రాకూడదు. గొంతు తగ్గించండి. దేశంలోని ప్రధానమైన కోర్టులో మీరు వాదించే విధానం ఇదేనా.. జడ్జిల సమక్షంలో అరవడం సమంజమేనా? కోర్టును బెదిరించాలనుకుంటున్నారా..! అంటూ న్యాయవాదిపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ న్యాయవాది సీజేఐకి క్షమాపణలు చెప్పారు. సంయమనంతో వ్యవహరించాలని న్యాయవాదులను సీజేఐ హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఇలాగే మాట్లాడటంతో తగ్గాలని సీజేఐ హెచ్చరించారు. గతేడాది అక్టోబరులో కోర్టు హాలులో ఓ న్యాయవాది ఫోన్‌లో మాట్లాడటం చూసి..ఇదేమైనా మార్కెట్టా ఫోన్‌లో మాట్లాడుకోవడానికి అని వ్యాఖ్యానించారు. అదేసమయంలో న్యాయవాదుల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

